రైతుల కన్నీటి గాధకు, ట్రాన్స్పోర్ట్ ఆదాయం రెండు కోట్లు.!
టెండర్ లో ఆర్ సి ఇచ్చిన లారీలు ఎక్కడ,? టెండర్ లారీల పేరుతో ట్రక్ షీట్ ఎందుకు రావడం లేదు. ఐదు శాఖలకు లక్షల రూపాలు ముట్టజెప్పి అంతా గోల్మాల్.!? ఓపెన్ టెండర్ లేదు, ప్రతిసారి సింగిల్ టెండర్ ఎందుకు.!? ఇతరులు టెండర్ పట్టకుండా ముందస్తుగా అధికారులకు సూట్ కేస్.!? ఉన్నత అధికారులంతా కాంట్రాక్టర్ గుప్పిట్లోనే. వరి సీజన్, రైతులకు శాపం, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కు కోట్ల ఆదాయం. ఇప్పటికైనా కాంట్రాక్టర్ మారితేనే ధాన్యం సక్రమంగా రవాణా. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వ్యవస్థ పై చీఫ్ సెక్రటరీ స్పందించాలి. రైతులు.
రైతుల కన్నీటి గాధకు, ట్రాన్స్పోర్ట్ ఆదాయం రెండు కోట్లు.!
టెండర్ లో ఆర్ సి ఇచ్చిన లారీలు ఎక్కడ,?
టెండర్ లారీల పేరుతో ట్రక్ షీట్ ఎందుకు రావడం లేదు.
ఐదు శాఖలకు లక్షల రూపాలు ముట్టజెప్పి అంతా గోల్మాల్.!?
ఓపెన్ టెండర్ లేదు, ప్రతిసారి సింగిల్ టెండర్ ఎందుకు.!?
ఇతరులు టెండర్ పట్టకుండా ముందస్తుగా అధికారులకు సూట్ కేస్.!?
ఉన్నత అధికారులంతా కాంట్రాక్టర్ గుప్పిట్లోనే.
వరి సీజన్, రైతులకు శాపం, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కు కోట్ల ఆదాయం.
ఇప్పటికైనా కాంట్రాక్టర్ మారితేనే ధాన్యం సక్రమంగా రవాణా.
ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వ్యవస్థ పై చీఫ్ సెక్రటరీ స్పందించాలి. రైతులు.
మహాదేవపూర్ భూపాలపల్లి, మే 19( నిజం న్యూస్)
వడ్ల కొనుగోలు సీజన్ ప్రారంభం తో ఆరుకాలం పండించిన పంట విక్రయానికి సంతోష పడాల్సిన రైతు కు, ధాన్యం విక్రయించడం, కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం రైసు మిల్లు వరకు, తరలించేవరకు రైతుల కన్నీటి గాథలకు, లెక్కలేదు కల్లా ల నుండి కొనుగోలు కేంద్రం వరకు తరలింపు తో మొదలై, బార్ధాన్ సంచుల గోసలు, రాత్రి పగలు కాపలా, చివరికి రైస్ మిల్లు వరకు రవాణా, కొరకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పెట్టే తిప్పలు రైతులు తమ రైతు జీవితంపై విరక్తి చెందేలా చేస్తున్న క్రమంలో, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ప్రధాన ఐదు శాఖల ఉన్నత అధికారుల తో చేతులు కలిపి రెండు కోట్ల ఆదాయం రెండున్నర నెలలలో,తన సంపాదన లక్ష్యంగా, అనేక అక్రమాలతో రైతుల రక్తాన్ని పిండి కాంట్రాక్టర్ తన ఆదాయానికి మాత్రం కనీస కష్టం లేకుండా సొమ్ము చేసుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా, ఆనవాయితీలా కొనసాగుతుంది అని బహిరంగంగా చెబుతున్నారు రైతులు. ఈ తతంగమంతా ఇసుక లారీలు ఆపి, వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం రవాణా కొరకు పంపించే క్రమంలో, ఇసుక లారీ డ్రైవర్లు ఒప్పుకోకపోవడం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వ్యవహారం అంతా బయటపడింది.
టెండర్ లో ఆర్ సి ఇచ్చిన లారీలు ఎక్కడ,?
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లుల వరకు ధాన్యం రవాణా చేసే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వ్యవహారం. రైతులు గోసలు పడుతున్న, వర్షాలు వడగాలులు విస్తున్న, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దవుతున్న, నాలుగు మండలాల్లో ట్రాన్స్పోర్ట్ సదుపాయం చేపడతాను అని 65 నుండి 100 లారీలు చూపెట్టి తీసుకున్న కాంట్రాక్టర్, పత్తా లేకుండా స్థానిక వాహనాలకు, రైస్ మిల్లులు దగ్గర్లోనే కదా అంటూ తక్కువ ధర చెల్లించే ప్రయత్నం, మరోవైపు అధికారులు ఇతర వాహనాల యజమానులు డ్రైవర్లకు భయభ్రాంతులకు గురిచేసి, వడ్ల కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు, తక్కువ ధరకు కాంట్రాక్టర్ కు అప్పగించి ధాన్యాన్ని తరలించుటకు ప్రైవేట్ వాహనాల పై దౌర్జన్యం, చేస్తూ వాహనాలు తరలించే కార్యక్రమం చేయడం, కాంట్రాక్టర్ టెండర్లు నమోదు చేసిన లారీల ఆర్ సి లో పెట్టిన లారీలు, ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించే నాధుడు, లేకపోవడం, ఇప్పటికీ మండలంలో కేవలం 33% అది కూడా సోమ మంగళవారం నాటికి, ధాన్యం రైస్ మిల్లులకు రవాణా కావడం జరిగిందని సమాచారం. కాంట్రాక్టర్ అధికారుల చేతివాటకం ఎంతవరకు దారితీసింది అంటే, టెండర్లు రిజిస్టర్ అయిన లారీల నంబర్లతో “ట్రక్ సీట్లు”రాకుండానే, ప్రైవేట్ వాహనాల్లో పంపిన ధాన్యాన్ని ట్రాక్ షీట్ నమోదు చేయడం, సాధారణంగానే కొనసాగుతుంటే టెండర్ ప్రక్రియ ఎందుకు వేసినట్లు ఎవరి స్వలాభం కొరకు, వరి ధాన్యం రవాణా ట్రాన్స్పోర్ట్ టెండర్ ప్రక్రియ వేయడం జరిగిందో స్పష్టంగా కనబడుతుంది అంటున్నారు రైతులు.
ఐదు శాఖలకు లక్షల రూపాలు ముట్టజెప్పి అంతా గోల్మాల్.!?
వరి ధాన్యం రవాణా కాంట్రాక్ట్ వ్యవహారం, చూస్తే నామమాత్రంగా కనబడుతుంది. వడ్ల బస్తాలు తరలించుడే కదా, అనే భ్రమలో ఉన్నారు రైతులు మరియు ప్రజలు. కానీ దీని వెనుక, భారీ స్కాం దాగి ఉన్న విషయం, ఇప్పుడు ఇప్పుడే బయటపడింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలు మరియు రవాణా కొరకు, ట్రాన్స్పోర్ట్ టెండర్ మరియు కాంట్రాక్ట్, ఆదాయ వ్యవహారం ప్రజల ఊహలకు అందకుండా ఉంది, వరి కొనుగోలు నుండి రవాణా ప్రక్రియ వరకు ఐదు ప్రధాన శాఖల వ్యధిలో కొనసాగే, ఈ ప్రక్రియ లక్షల రూపాయలు చేతులు మారి, కాంట్రాక్టర్ కు సుమారు రెండు కోట్ల వరకు ఆదాయాన్ని అందిస్తుంది ఆట ఈ ట్రాన్స్పోర్ట్ కాంటాక్ట్. ప్రతి టెండర్ ప్రక్రియ ఓపెన్ టెండర్ గా ఉంటుంది అది సహజంగా అందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ మాత్రం “ఓన్లీ సింగిల్ టెండర్” ఎవరు టెండర్బుకు రారు, వచ్చిన వారికి టెండర్ దక్కదు, ఒకవేళ కింద మీద పడి టెండర్ దక్కించుకున్న, ఆ కాంట్రాక్టర్, ఆ ఐదు శాఖల అధికారుల ఒత్తిడికి బలి కావాల్సిందే, ఎందుకంటే అంతా చేతులు తడిపే స్థాయి వారికి ఉండదు. ఏళ్ల తరబడి ఆరితేరిన ప్రస్తుత కాంట్రాక్టర్ కు అధికారుల లొసుగులు చేతులు తడుపుడు అంతా తెలుసు కనుక, అందుకే ఒకే వ్యక్తి సింగిల్ టెండర్, ఎప్పుడు అతనికి దక్కుతుంది. మరి ఎవరైనా టెండర్ వేస్తాం అంటే, ఈ కాంట్రాక్టర్ ముందుగానే అధికారులకు సూట్ కేస్ పంపిస్తాడట, ఇక మరొకరు టెండర్ కు వచ్చే పరిస్థితి ఉండదు. ఇలా తమ ఏక సామ్రాజ్యాన్ని, జిల్లా ఉన్నత అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని, గత కొన్ని ఏళ్లుగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ను కైవసం చేసుకొని, రైతుల కండ్ల నుండి రక్తపు కన్నీరు వచ్చేలా చేస్తూ, తన అక్రమ ఆదాయానికి గండి పడకుండా టెండర్ మరి వారికి దక్కకుండా, ఉన్నత అధికారులకు తమ గుప్పిట్లో పెట్టుకుని, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ పేరుతో అరాచకాన్ని కొనసాగిస్తూ సొమ్ము చేసుకోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు రైతులు.
సీజన్, రైతులకు శాపం, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కు కోట్ల ఆదాయం.
ప్రస్తుతం మహదేవపూర్ మండలం తో పాటు సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో, వరి సీజన్ ఆరుకాలం కష్టపడి పండించి ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించే ఆ రైతులకు, మద్దతు ధర లభిస్తుందన్న ఆనందం, కేవలం ఒక ఆశగానే మారి రైతులకు మాత్రం, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ సమయానికి ధాన్యం రవాణా చేయకపోవడం, తో రైతులకు శాపంగా మారింది. కానీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కు మాత్రం, ప్రతి ఏటా ఇదే వ్యవహారం రెండు కోట్ల ఆదాయాన్ని మాత్రం, గుట్టు చప్పుడు కాకుండా అందిస్తుంది. నాలుగు మండలాల్లో సమయానికి ముందు నుండి ధాన్యం రవాణా కొరకు లారీల సదుపాయం ఉందని, పదుల సంఖ్యలో లారీల ఆర్ సీలు బూచిగా చూపెట్టి, కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్, తక్కువ ధరకు లోకల్ లారీలు సమకూర్చే ప్రయత్నం, లేదంటే ప్రైవేట్ వాహనాలపై అధికారులతో ఒత్తిళ్లు చేసి ధాన్యం రవాణా చేసే ప్రయత్నంలో, సమయం దాటిపోయి, అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయి, తూకం పేరుతో రైస్ మిల్లలో కోత, కింటల్లా ధాన్యం, సమయానికి రవాణా చేయకపోవడంతో వర్షాలకు తడిసి, మునిగిపోవడం, ఇలాంటి పరిస్థితులు రైతులకు ఎదురై, ప్రభుత్వం ఇచ్చిన మాటకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్న క్రమంలో, కాంట్రాక్టర్ వ్యవహారం రైతులకు శాపంగా మారి నష్టాన్ని వాటిల్లే లా చేస్తుంది. అనేక సంవత్సరాలుగా ఒకే కాంట్రాక్టర్, ధాన్యం రవాణా కొరకు తీసుకున్న కాంట్రాక్ట్, తో అనేక రైతుల ధాన్యం సమయానికి రవాణా కాకపోవడంతో, ఇబ్బందులు పడి నష్టపోయినప్పటికీ కూడా, చివరికి అదే కాంట్రాక్టర్ తిరిగి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ దకించుకోవడం, ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పడి 25 రోజుల నుండి 33 రోజులు అవుతున్న క్రమంలో, కేవలం చిన్న కొనుగోలు కేంద్రాల నుండి 40 శాతం వరి రవాణా, అలాగే పెద్ద కొనుగోలు కేంద్రాల నుండి కేవలం 22 నుండి 25 ఐదు శాతం వరకు వరి ధాన్యం రవాణా చేయడం జరిగింది. వర్షాకాలానికి అతికొద్ది రోజులే ఉన్న క్రమంలో సుమారు 65 నుండి 70 శాతం వరకు మహాదేవపూర్ మండలం తో పాటు, సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో ధాన్యం ఇంకా రవాణా కాకపోవడం, కేవలం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అని అంటున్నారు బాధిత రైతులు. ధాన్యం రవాణా కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ, జిల్లా అధికారులు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, చర్యలు తీసుకోకుండా, కాంట్రాక్టర్ను పరోక్షంగా రక్షించి క్రమంలో ప్రైవేటు వాహనాలపై ఒత్తిడి చేస్తూ ధాన్యం రవాణాకు వాహనాలను పంపించే క్రమంలో, ప్రైవేట్ వాహనాలు ససే మీరా అంటున్న క్రమంలో, జిల్లా అధికారులు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం రవాణా కొరకు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ ను తక్షణమే తొలగించి, తాత్కాలికంగా ఇతర కాంట్రాక్టర్ కు అప్పగించాలని, అప్పుడే తమ ధాన్యం సురక్షితంగా సాధ్యమైనంత త్వరలో రైస్ మిల్లులకు చేరి, తమకు న్యాయం జరుగుతుందని, చీఫ్ సెక్రటరీ గారికి వేడుకుంటున్నారు రైతులు.



