మంత్రి గ్రామ రైతులను సైతం వదలని కాంట్రాక్టర్.
మంత్రి స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి, రైతులు.

- మంత్రి గ్రామ రైతులను సైతం వదలని కాంట్రాక్టర్.
మంత్రి స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి,
రైతులు.
మహాదేవపూర్, భూపాలపల్లి: మే 20( నిజం న్యూస్)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మహాదేవపూర్ సబ్ డివిజన్ పరిధిలో వడ్ల కొనుగోలు తరలింపు వ్యవహారం అధికారుల కనుసైగల్లో కాంట్రాక్టర్ అరాచకాన్ని సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి వరి కొనుగోలు రవాణా విషయంలో, ఏలాంటి జాప్యాన్ని సహించమని తేల్చి చెప్పిన, డోంట్ కేర్ అనేలా అధికారులు వ్యవహరించడం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కు పరోక్షంగా మద్దతిస్తూ, 30 రోజులుగా ధాన్యాన్ని రవాణా చేయకుండా కాంట్రాక్టర్ లారీల సదుపాయం కల్పించకపోవడం పై కూడా అధికారులు అడ్డదారులు తొక్కుతూ, కాంట్రాక్టర్ కు మేలు చేసే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగించడం జరుగుతుందని, కాంట్రాక్టర్ చేయాల్సిన పనిని అధికారులు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి కాంట్రాక్టర్ వద్ద లారీలు లేకుంటే టెండర్ ఎందుకు అప్పగించినట్లు, వీటన్నిటికీ సమాధానం కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మకయ్యారని స్పష్టంగా కనబడుతుంది.
ఇదిలా ఉండగా మరో సంచలనమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన రైతులు తమ ధాన్యాన్ని గత 20 రోజులుగా రవాణా చేయకుండా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. ఇది ఎక్కడో కాదు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని, రాష్ట్ర ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగ్రామమైన ధన్వాడ గ్రామంలో, కాంట్రాక్టర్ అరాచకం తెరపైకి వచ్చింది. సబ్ డివిజన్ పరిధిలో ఇతర మండలాల్లో కాంట్రాక్టర్ అరాచకాన్ని సాగిస్తున్నాడు అన్న విషయం గత కొన్ని రోజులు కాదు సంవత్సరాలనుండి ఒకే కాంట్రాక్టర్, రవాణా పేరుతో, అరాచకాన్ని కొనసాగించడం శర మాములుగానే కొనసాగుతుంది కానీ, కాంట్రాక్టర్ పలుకుబడి ఎంతవరకు వెళ్లిందంటే, ఏకంగా మంత్రి సొంత ఊరిలోనే రైతుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపకుండా, ఉన్నాడంటే అధికారుల ఆశీర్వాదం ఈ కాంట్రాక్టర్ పై ఎంతుందో అర్థమవుతుంది. ఇలాంటి కాంట్రాక్టర్ పై ఎన్ని కథనాలు ఎన్ని నిరసనలు, రైతులు ఎన్ని ధర్నాలు చేసిన ఏమీ ఫరక్ పడదని, మంత్రి గ్రామానికి చెందిన రైతులని లెక్కచేయని కాంట్రాక్టర్ ఇతర మండలాలు ఇతర గ్రామాల రైతులకు ఇలా లెక్క చేస్తాడు అనేది ఇప్పుడు చర్చనీయంగా మారింది. కాంట్రాక్టర్ పై అలాగే ఇతనికి సహకరిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని, వేరే కాంట్రాక్టర్కు ట్రాన్స్పోర్ట్ బాధ్యతలు అప్పగించాలని లేదా కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు ట్రాన్స్పోర్ట్ బాధ్యతలు అందించి సకాలంలో రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సబ్ డివిజన్ రైతులు.



