90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం గా ప్రభుత్వం,ముఖ్యమంత్రి.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కన్నా రెండింతల కొనుగోలు లక్ష్యం.

90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం గా ప్రభుత్వం,ముఖ్యమంత్రి.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కన్నా రెండింతల కొనుగోలు లక్ష్యం.
అకాల నష్టాన్ని తగ్గించుటకు ప్రత్యేక వ్యవస్థ.
తాలు తరుగు పేరుతో కూతను సహించేది లేదు.
ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం పై కలెక్టర్లది పూర్తి బాధ్యత. మంత్రి ఉత్తం.
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు, పక్క రాష్ట్రాల నుండి ధాన్యం సరఫరాపై నిఘా, మంత్రి నాగేశ్వరరావు.
ధాన్యం కొనుగోలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలి, కలెక్టర్.
భూపాలపల్లి మహాదేవపూర్: మే 12( నిజం న్యూసస్)
ఈ యాసంగి పంట సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి. మంగళవారం రోజు మొక్కజొన్న ధాన్యం కొనుగోలు పై నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ చేస్తామని అధికారులను హెచ్చరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాకిటి శ్రీహరి సీతక్క అల్లూరి లక్ష్మణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించిందని, కానీ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.575 కొనుగోలు కేంద్రాల నుండి 258 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, మరో 11 టన్నుల ధాన్యం నిలువ ఉందని, రైతులకు మద్దతు ధర కోసం 3.873, కోట్లను విడుదల చేసినట్లు, అలాగే 18 కోట్ల 68 లక్షల గన్ని సంచులు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రైవేట్ గోదాములు ధాన్యం నిల్వ కోసం తమ ఆధీనంలో తీసుకోవాలని, కమ్యూనిటీ హాళ్లు రైతు బజార్లను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగించుకోవాలని, ఎస్పీలు సీసీలు రవాణా అధికారులు కొనుగోలు ప్రక్రియలు పాల్గొనాలని, అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయాలని హమాలీ కొరత రాకుండా స్థానిక ఉన్న హమాలీలకు వినియోగించుకోవాలని, హమాలీ కొరత రాకుండా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. పరుగు మరియు తాలు పేరుతో కూతలు జరగకుండా చూడాలని, అలాగే పంట రవాణా కోసం స్థానికంగా ఉన్న ట్రాక్టర్లు మరియు డీసీఎం వాహనాలను, ఉపయోగించుకోవాలని కొనుగోలు కేంద్రాల వద్ద తార్పార్లు సిద్ధంగా ఉంచాలని, తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, రైస్ మిల్లుల వద్ద రద్దీ లేకుండా దిగుమతి పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని, ప్రతిరోజు నివేదిక పంపించాలని కొనుగోల వ్యవహారం పై జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. కార్యాలయాలకు పరిమితం కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని, ధాన్యం కొనుగోలు రవాణా విషయంలో నిర్లక్ష్యంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ధాన్యం కొనుగోలు వ్యవహారం తేలిక తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సి ఎం,
అకాల నష్టాన్ని తగ్గించుటకు ప్రత్యేక వ్యవస్థ.
ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అకాల నష్టానికి సంబంధించి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి నష్టాన్ని తగ్గించుటకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని దానికి సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. అకాల వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా ఉండుటకు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచి వాతావరణ శాఖ సూచన ఆధారంగా రైతులకు అప్రమత్తం చేయుటకు మండల స్థాయి అధికారిని నియమించి, వాతావరణ సూచన రైతుల వద్దకు చేరవేసుటకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు, ప్రతి ఐకెపి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారి నియామకం, చేసి పర్యవేక్షణ అలాగే జిల్లా కలెక్టర్లు ప్రత్యక్ష పర్యవేక్షిస్తే సమస్యల పరిష్కారం అవుతాయని, కలెక్టర్లు కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పడిన సమస్యలను బాధ్యతగా తీసుకొని పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


