ఈవీఎం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.
ఈవీఎం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.

ఈవీఎం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.
భూపాలపల్లి మహాదేవపూర్ మీ 11( నిజం న్యూస్)
జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు, సోమవారం రోజు ఇవి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కేంద్రం లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మరియు వి వి పాడ్ యంత్రాల భద్రతను పరిశీలించడం జరిగింది. గోదాం వద్ద భద్రత చర్యలు సిసిటీవీ పర్యవేక్షణ అగ్నిమాపక పరికరాలు డబుల్ లాక్ సిస్టం లాంటి తదితర అంశాలను కలెక్టర్ క్షుణంగా పరిశీలించారు, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్ భద్రత, తో పాటు ఎన్నికల సంఘం సూచించిన విధానాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు, సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు కలెక్టర్, స్ట్రాంగ్ రూమ్ తనిఖీ లో భాగంగా జిల్లా కలెక్టర్ రిజిస్టార్ లో సంతకం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్ నవీన్ లు ఉన్నారు.



