జిల్లావ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

జిల్లావ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

రెపరెపలాడిన జాతీయ జెండా, జాతీయ గీతం.

అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు.

రాజకీయ పార్టీల కార్యాలయాల్లో అవతరణ దినోత్సవ వేడుకలు.

గ్రామ పంచాయితీ, వ్యవసాయ, సహకార సంఘాల్లోనూ వేడుకలు

మహాదేవపూర్ భూపాలపల్లి జూన్ 2 (నిజం న్యూస్)

భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని 12 మండలాల్లో, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల తో పాటు రాజకీయ పార్టీ కార్యాలయాలు, వ్యవసాయ సహకార సంఘాలతోపాటు స్వచ్ఛంద సంఘాలు అలాగే, జిల్లాలోని గ్రామపంచాయతీల్లో, సర్పంచుల ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. అలాగే తెలంగాణ ఉద్యమకారుల సంఘం, ఇతర వ్యాపార సముదాయాల సంఘాల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలోని, మున్సిపాలిటీ కార్యాలయం తో పాటు, సింగరేణి కార్యాలయం, అలాగే సింగరేణి కార్మికుల కార్యాలయాల్లో సైతం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా లు ఆవిష్కరించి, అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ప్రార్మానికి ముఖ్యఅతిథిగా, ప్రభుత్వ విప్ శ్రీనివాస్ రెడ్డి హాజరు కావడం జరిగింది. విప్ వేడుకల ప్రారంభానికి ముందు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, అవతరణ దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా వారికి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కార్యాలయంలో, ఏర్పాటుచేసిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా చీఫ్ ఇంజనీర్ చిట్టా ప్రగాఢ శ్రీ ప్రకాష్, పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి జాతీయ పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్, సింగరేణి కార్యాలయంలో జనరల్ మేనేజర్ తో పాటు సింగరేణి కార్మిక సంఘాల కార్యాలయాల్లో, ఆయా కార్మిక సంఘాల నాయకులు కార్మికుల సమక్షంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు.

మహాదేవపూర్ మండలం తో పాటు కాటారం సబ్ డివిజన్ పరిధిలోని, మండలాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా, పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మహదేవపూర్ ఒకటవ వార్డు సభ్యుడు నల్లపూసమ్మయ్య ఆధ్వర్యంలో, మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ కూలి నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లి, వారికి మజ్జిగ పాకెట్లను అందించడం జరిగింది. అలాగే మండల కేంద్రంలో సర్పంచ్ హసీనా అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్ మరియు,షొప్ కిట్లు అలాగే షూ, లను సర్పంచ్ మరియు పాలకవర్గం సమక్షంలో అందించడం జరిగింది. మండలంలోని మహాదేవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో, సర్పంచ్ హసీనా అక్బర్ ఖాన్ అలాగే కార్యదర్శి కల్పన ఆధ్వర్యంలో, అవతరణ దినోత్సవ సందర్భంగా జాతీయ పతాయకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే మండలంలోని మద్దులపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ హెల్పుల సరిత రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, ఈ కార్యక్రమాల్లో గ్రామ పంచాయతీలకు సంబంధింన పాలకవర్గం, ఉప సర్పంచ్ లు, సిబ్బంది ఉన్నారు.

‎రాజకీయ పార్టీల కార్యాలయాల్లో అవతరణ దినోత్సవ వేడుకలు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మంగళవారం రోజు మండల కేంద్రంలోని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు అక్బర్ ఖాన్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, కార్యాలయంలో అధ్యక్షులు జాతీయ జెండాలు ఆవిష్కరించి, అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే పలు స్వచ్ఛంద సంస్థ కార్యాలయాల్లో నిర్వాహకులు, పలు వ్యాపార దుకాణ సముదాయాల కు సంబంధించిన నిర్వాహకులు, కుల సంఘాల సంఘాల ఆధ్వర్యంలో అధ్యక్షులు, ఆయా కార్యాలయాల్లో అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

‎గ్రామ పంచాయితీ, వ్యవసాయ, సహకార సంఘాల్లోనూ వేడుకలు

  1. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధ్యక్షుడు, డైరెక్టర్ల సమక్షంలో, జాతీయ పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మహాదేవపూర్ మండలానికి చెందిన డైరెక్టర్ ఎం డి ఇర్షాద్ అహ్మద్, పూత రమేష్ లు ఉన్నారు. అలాగే మండల కేంద్రంలోని పి ఎ సి ఎస్ కార్యాలయంలో చైర్మన్ తిరుపతి రెడ్డి తోపాటు డైరెక్టర్ల సమక్షంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ను ఆవిష్కరించడం జరిగింది. మండల ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడు ఎండి అక్రమ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో తొలి దశ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button