‎రెవెన్యూ సదస్సు దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి, కలెక్టర్.

లింగ నిర్ధారణ అరికట్టుటకు చర్యలు తీసుకోవాలి. సకాలంలో సేవలు అందించిన అధికారులకు అభినందనలు. మజిలీస్ పార్టీ జిల్లా బి.ఎల్.ఎన్, గా గులాబ్ అహ్మద్.

‎రెవెన్యూ సదస్సు దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి, కలెక్టర్.

లింగ నిర్ధారణ అరికట్టుటకు చర్యలు తీసుకోవాలి.

సకాలంలో సేవలు అందించిన అధికారులకు అభినందనలు.

మజిలీస్ పార్టీ జిల్లా బి.ఎల్.ఎన్, గా గులాబ్ అహ్మద్.

భూపాలపల్లి మహాదేవపూర్, జూన్ 11 నిజం న్యూస్.

రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవాలని అన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఐడిఓసి కార్యాలయంలో బల్క్ భూముల సమస్య సాదా బైనామా మరియు రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు, అలాగే ప్రజావాణి దరఖాస్తుల మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్లు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ సమస్యలు సాదా బహినామ కేసులు, రెవెన్యూ సదస్సులో వచ్చిన వినుతులపై వివరంగా కలెక్టర్ చర్చించడం జరిగింది. రైతుల భూముల హక్కు పత్రాలు జారీ కొరకు, సర్వే చేయడం జరుగుతుందని అన్నారు కలెక్టర్, అలాగే రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి భూ సమస్యల వినతులను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు, మీసేవ జారీ చేసే సర్టిఫికెట్లు జాప్యం చేయకుండా సాధ్యమైనంత త్వరలో సర్టిఫికెట్లు అందించాలని ముఖ్యంగా విద్య సంస్థ సంవత్సరం ప్రారంభం అవుతున్న క్రమంలో జాప్యం చేయకూడదని కలెక్టర్ సూచించారు.

‎లింగ నిర్ధారణ అరికట్టుటకు చర్యలు తీసుకోవాలి.

‎గర్భస్థ శిశు లింగ నిర్ధారణ అరికట్టుటకు కట్టుదిడ్డమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు ఆదేశించారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో బి సి పి ఎన్ డి టి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై వైద్య పోలీస్, ఐఎంఏ మాలి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. నిబంధన ఉల్లంఘన పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కలెక్టర్, జిల్లాలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ వైద్య సంస్థలు నమోదు ప్రక్రియను పూర్తి చేసి చట్టపరమైన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు, వైద్య సేవలు పారదర్శకంగా నాణ్యమైన వైద్యాన్ని అందించుటకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు కలెక్టర్.

సకాలంలో సేవలు అందించిన అధికారులకు అభినందనలు.

జిల్లాలో జిల్లా అధికారులుగా సకాలంలో సేవలు అందించి బదిలీపై వెళ్లిన అధికారులకు అభినందించారు కలెక్టర్ రాహుల్ శర్మ, గురువారం రోజు కలెక్టర్ ఛాంబర్ లో జగిత్యాల జిల్లాకు బదిలీ అయిన రవాణా అధికారి మొహమ్మద్ సందాని, క్వాలిటీ కంట్రోల్ ఈ ఈ బదిలీ అయి వెళ్లిన భూపాలపల్లి డివిజన్ ఈ ఈ బసవ ప్రసాద్, పరకాల ఉద్యాన అధికారిగా నియమితులైన జిల్లా ఉద్యాన అధికారి సునీల్ కుమార్, జిల్లా కలెక్టర్ ను కలిసి మొక్కలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారి సేవలను అభినందించి, సకాలంలో వారు అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో తమ తమ బాధ్యతలల్లో ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. బదిలీపై వెళ్లిన అధికారులకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

‎మజిలీస్ పార్టీ జిల్లా బి.ఎల్.ఎ,గా గులాబ్ అహ్మద్.

‎జయశంకర్ భూపాలపల్లి జిల్లా బి ఎల్ ఏ ఒకటిగా కరీంనగర్ మజిలీస్ పార్టీ అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నియమించడంతో తమ నియామక పత్రాన్ని గురువారం రోజు గులాం అహ్మద్ హుస్సేన్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు అందించారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ మాట్లాడుతూ, జిల్లాకు బిఎల్ఎ ఒకటిగా తనకు నియమించడం తో పార్టీ నాయకత్వం జాతీయ అధ్యక్షుని కి రుణపడి ఉంటానని అన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, జిల్లాలోని ఎస్ఐఆర్ నిర్వహణ కోసం మజిలీస్ పార్టీ పార్టీ నుండి ప్రభుత్వం మరియు ప్రజలకు వారధిగా ఉండి ఓటర్ మ్యాపింగ్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తానని అన్నారు బి ఎల్ ఏ గులాం అహ్మద్ హుస్సేన్. అలాగే జిల్లాలోని అన్ని బూతుల్లో బిఎల్ఎ, రెండు, ప్రతినిధులను హైకమాండ్ ఆదేశాల మేరకు త్వరలో నియమించడం జరుగుతుందని తెలిపారు హుస్సేన్.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button