పది లో ప్రతిభ చాటిన మహా మండలం.

జిల్లా టాపర్ గా గుడ్ మార్నింగ్ విద్యార్థి. రెండవ స్థానంలో గ్రీన్ వుడ్ మరియు, ప్రభుత్వ పాఠశాలలు. కస్తూరిబా గాంధీ పాఠశాల కూడా జిల్లా రెండవ స్థానం.

మహాదేవపూర్ మండలం పదవ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభను చాటుతూ జిల్లా స్థాయిలో సత్తా చాటుకుంది. బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ వంద శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ ఫలితాలతో మహాదేవపూర్ మండలం జిల్లాలో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.ఈ ఏడాది ఫలితాల్లో గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థి రక్షిత 582 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. ఇదే పాఠశాలకు చెందిన అమృత 573, అక్షిత 550, ఆశిష్ 547, రమాకాంత్ 546, సుమయ్య అంజూమ్ 543 మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్ఠను మరింత పెంచారు. విద్యార్థుల ఈ విజయానికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల కృషి కీలక పాత్ర పోషించింది.

 

ఇక గ్రీన్ వుడ్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా అద్భుత ప్రదర్శన కనబరిచారు. వర్షిత్ కుమార్ 565, సిద్ధార్థ 563, మనీ తేజ 561, జస్వంతి 553, ఉమామహేశ్వర్ 552, వై శ్రీనిధి 552 మార్కులు సాధించి పాఠశాలను జిల్లా రెండవ స్థానంలో నిలిపారు. విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఈ విజయానికి కారణమని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.అదే విధంగా కస్తూరిబా గాంధీ ఆశ్రమ పాఠశాల (కేజీబీ) విద్యార్థులు కూడా విశేష ప్రతిభను కనబరిచారు. ఈ పాఠశాల కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లా రెండవ స్థానాన్ని అందుకుంది. చేర్యాల కీర్తి 529, అంజలి 521, సయ్యద్ షఫానా 520 మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ విద్యార్థుల విజయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. మహాదేవపూర్ మండలంలో మొత్తం 335 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరై అందరూ ఉత్తీర్ణత సాధించడం విశేషం. వీరిలో 164 మంది బాలురు, 171 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా బాలికలు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, జిల్లా స్థాయి టాప్ మార్కులు సాధించడం గర్వకారణంగా నిలిచింది.

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్ మండలం ఈ ఫలితాలతో అగ్రస్థానంలో నిలవడం, మండల విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం కలసి ఈ విజయానికిదోహ దపడ్డాయి.విజయవంతమైన విద్యార్థులను మండల ప్రజలు హర్షాతిరేకంతో అభినందిస్తున్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించిన ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నిర్వాహకులు కూడా విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ విజయంతో మహాదేవపూర్ మండలం జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు పొందే దిశగా ముందుకు సాగుతోంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button