రహదారి,వసతులు లేకున్నా, కాలేశ్వరాన్ని టార్గెట్ చేసి టోల్ వసూల్.
ప్రజల సొమ్ము పలు రకాలుగా దోచుకోవాలని సంకల్పం తో ఉన్న శాఖలకు, పెద్ద కష్టమేమీ కాదు, అవి రాష్ట్ర లేదా కేంద్ర శాఖలైన, శాఖ పరిధిలో అధికారులైన

ప్రజల సొమ్ము పలు రకాలుగా దోచుకోవాలని సంకల్పం తో ఉన్న శాఖలకు, పెద్ద కష్టమేమీ కాదు, అవి రాష్ట్ర లేదా కేంద్ర శాఖలైన, శాఖ పరిధిలో అధికారులైన, తమ విధి బాధ్యతలను విస్మరించి కేవలం ప్రజల సొమ్మును దూచుకోవడంలో మాత్రం, ఆరి తేరి వాటికి చట్టాలను కూడా ప్రదర్శించడంలో వెనుకాడరు, అనడానికి ఒక నిదర్శనం, ప్రత్యక్షమైన సాక్ష్యం 18 నెలల 8 రోజుల నుండి లక్షల రూపాయల అమాయక ప్రజల సొమ్ము, కనీస మౌలిక సదుపాయం, నాణ్యమైన రహదారి లేకున్నా, వందల రూపాల టోల్ పేరుతో వసూలు చేసి, ఏన్ హెచ్ ఏ ఐ, జాతీయ రహదారి సంస్థకు, అప్పజెప్పడం జరుగుతుంది,
నేషనల్ హైవే అంటే ఆ రహదారి, అధునాతనమైన నాణ్యతతో కూడినటువంటి రహదారికి పెట్టిన పేరు నేషనల్ హైవే, కానీ 353 సి హైవే పదాన్ని మార్చేసింది, హైవే ఎట్ ది రేట్ బొందల గడ్డ అనే సూత్రానికి తీసుకువచ్చింది, మరో వింత విచిత్రం ఈ బొందల గడ్డకు ఇన్ హెచ్ ఏ ఐ టోల్గేట్ ఏర్పాటుచేసి,మోర్ధ్” అర్ అండ్ బి, శాఖ పరిధిలోకి నెట్టడంతో, ఒకటి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ శాఖ, మరొకటి జాతీయ రహదారుల శాఖ, రెండు శాఖల మధ్య, నేషనల్ హైవే 353, బొందల గడ్డకు మారడం ఒకవైపు అయితే, మేడిపల్లి వద్ద టోల్ ప్లాజా అని పేరు పెట్టి పేద అమాయక ప్రజలు మరియు వాహనదారుల నుండి, వందల రూపాయల టోల్ వసూలు చేయడం కొసమెరుపు,
కాలేశ్వరం అంత రాష్ట్రీయ వంతెన ఇటువైపు తెలంగాణ భూభాగం నుండి, భూపాలపల్లి వరకు మాత్రం, 75 నుండి 85% వరకు హైవే బొందల గడ్డ గా మారి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు వాహనదారుడు, అయినప్పటికీ, జాతీయ రహదారి సంస్థ, రాష్ట్ర మినిస్ట్రీ రోడ్ మరియు ఆర్ అండ్ బి, పట్టించుకోకుండా ఎలాంటి వసతులు కల్పించకుండా టోల్ మాత్రం, గత 18 నెలలుగా కొనసాగించడం ఆశ్చర్యం.
జాతీయ రహదారి మరమ్మతుకు నోచుకోకుండా ఉండడంతో, పెద్ద మొత్తంలో భూపాలపల్లి నుండి కాలేశ్వరం వరకు, రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎందరు ఉన్నారు. ఇప్పటికీ జాతీయ రహదారుల సంస్థ 18 నెలలుగా అమాయకుల నుండి వసూలు చేసిన టోల్ లోని కనీస రూపాలను వెచ్చించి రహదారి మరమ్మతుతోపాటు టోల్ ప్లాజా వద్ద మౌలిక వసతుల కల్పన చేస్తే, ఎన్నో ప్రాణాలు గాలిలో కలవకుండా ఉండేవి, కానీ శాఖలు మరియు అధికారులు తమ బాధ్యతలను విస్మరించి, బొందల గడ్డగా మారి ఉన్న జాతీయ రహదారి 353 సి పై వాహనాల నుండి టోల్ వసూలు చేయడం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
మోర్ధ్” ఆర్ అండ్ బి రాష్ట్ర శాఖ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరవలసి ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కల్పనలో విఫలమై, నాణ్యమైన రోడ్డును చీకటి ఒప్పందానికి బలి చేసి, ఒకవైపు అమాయకుల ప్రాణాలతో చెలగాటము ఆడుతూ, బొందల గడ్డ బీటీ రోడ్డు కు టోల్ వసూలు చేసి రాష్ట్ర శాఖ ఎంతో ఘనకార్యం చేస్తుంది అంటున్నారు జిల్లా వాసులు, అంతేకాదు చివరికి బొందల గడ్డ బిటి రోడ్డు, మట్టి రోడ్డుగా మారిన “మోర్ధ్” శాఖ భూపాలపల్లి జిల్లా ప్రజల, సొమ్ము టోల్ రూపంలో వసూలు చేసి జాతీయ రహదారుల శాఖ ఖజానా తో పాటు తమ ఖజానా కూడా నింపు కొనుటకు సిద్ధమై ఉందని అందుకే 18 నెలలుగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద, నాణ్యమైన రహదారి మౌలిక వసతులు ఏర్పాటు చేసి వరకు టోల్ వసూలు నిలిపివేయాలని అంటున్నారు ప్రజానీకం.



