ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం పై కలెక్టర్లది పూర్తి బాధ్యత. మంత్రి ఉత్తం.
ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం పై కలెక్టర్లది పూర్తి బాధ్యత. మంత్రి ఉత్తం.

ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం పై కలెక్టర్లది పూర్తి బాధ్యత. మంత్రి ఉత్తం.
ముఖ్యమంత్రితో కలిసి జిల్లా కలెక్టర్ ల వీడియో కాన్ఫరెన్స్.
కొనుగోలు కేంద్రాల వద్ద ఇలాంటి సమస్యలు తలెత్తిన తక్షణమే ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, అలాగే ధాన్యం కొనుగోలు వ్యవహారంపై జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రవాణా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, చెల్లింపులు వేగవంతంగా జరిగేలా ట్యాబ్ ఎంట్రీ వెంటనే పూర్తి చేయాలని సూచించారు, యాసంగి సీజన్లో మొక్కజొన్న దిగుబడి భారీగా వచ్చిందని రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు సజావుగా నిర్వహించాలని అన్నారు, పక్క రాష్ట్రాల నుండి ధాన్యం సరఫరా కాకుండా విజిలెన్స్ మరియు బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగి సగటు 25 కింటల్లా దిగుబడి వచ్చి, ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు ఇప్పటికే జరిగిందని, మొక్కజొన్న కొనుగోలు కోసం రాష్ట్ర మంత్రివర్గం 4178 కోట్లను ఆమోదించడం జరిగిందని తెలిపారు మంత్రి ఉత్తం. అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని, హమాలీలు గన్ని సంచుల నిల్వ సామర్థ్యం అంశాలపై జిల్లా కలెక్టర్లతో నిరంతర సమన్వయం కొనసాగుతుందని తెలిపారు అలాగే హమాలీ చార్జీలను ఒక్క సంచికి 8.50 లకు పెంచినట్లు తెలిపారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి


