మేడిగడ్డ కు ముందే, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు.

మేడిగడ్డ కు ముందే, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు.
2014 మేడిగడ్డ ప్రాజెక్టుకు ముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 308 వేల కోట్లతో చే పట్టడం జరిగిందని అన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. బుధవారం రోజు మెడిగడ్డ పునరుద్ధారణ పనుల కొరకు జరుగుతున్న పరీక్షలను పరిశీలించుటకు వచ్చిన మంత్రి, పరిశీలన అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పేరుతో 38 వేల కోట్లు వెచ్చించి, 11 వేల కోట్ల రూపాయల పనులను దాదాపు 30 శాతం వరకు చేపట్టడం జరిగిందని అన్నారు. 2014 తర్వాత ఏర్పడిన ప్రభుత్వం, ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరుతో మార్పు చేసి మేడిగడ్డ ప్రాజెక్ట్ రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు,16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుటకు చేపట్టిన ప్రాజెక్ట్ పనులు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు నీరు అందక ఇబ్బంది కలిగిందని అన్నారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ప్రాజెక్టుకు కాలయాపన చేశారని లక్షా నలభై ఐదు వేల కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ పనులు చేపట్టడం జరిగిందని, బ్యారేజీ లోపా భూయిష్టమైన నిర్మాణం వల్ల కుంగడం జరిగిందని తెలిపారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. తిరిగి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రజలకు నీటి ఇబ్బంది తలెత్తకుండా తిరిగి ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు నిర్వహించి సాధ్యమైనంత త్వరగా మరమ్మత్తు పనులను పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు తాగు మరియు సాగు మీరు అందించుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు మంత్రి.



