ఆగని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, రైస్ మిల్లు అరాచకం.
బస్తాకు 10 ఇస్తేనే ట్రక్ షీట్. రైస్ బిల్లు వద్ద రెండున్నర కిలోల కోత. మరోవైపు ధాన్యం రవాణా చేయక, రైతుల నిరసన. రోడ్డుపై ధాన్యం బస్తాలను కాలబెట్టిన రైతులు.
ఆగని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, రైస్ మిల్లు అరాచకం.
బస్తాకు 10 ఇస్తేనే ట్రక్ షీట్.
రైస్ మిల్లు వద్ద రెండున్నర కిలోల కోత.
మరోవైపు ధాన్యం రవాణా చేయక, రైతుల నిరసన.
రోడ్డుపై ధాన్యం బస్తాలను కాలబెట్టిన రైతులు.
మహాదేవపూర్ భూపాలపల్లి( నిజం బ్రేకింగ్ న్యూస్)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సబ్ డివిజన్ పరిధిలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తో పాటు, అన్నపూర్ణ రైస్ మిల్ అరాచకానికి అంతులేకుండా పోయింది. తాజాగా మరోసారి పెద్ద మొత్తంలో, తాలు తరుగు పేరిట కోత విధిస్తూ రైస్ మిల్లు ట్రాక్ షీట్ అందించింది. ఇక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అరాచకానికి రోజురోజుకు హద్దు లేకుండా పోతుంది. ఒకవైపు రైతుల ధర్నాలు నిరసనలు కొనసాగుతున్న. జిల్లా యంత్రాంగం కాంట్రాక్టర్ మరియు రైస్ మిల్లులతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందానికి, అమాయక రైతులు బలికాక తప్పడం లేదు. అనటానికి ఇదే సాక్ష్యాలు. మహాదేవపూర్ మండలంలోని ఓ రైతుకు 900 బస్తాల వడ్లకు బస్తాకు రెండున్నర కిలో చొప్పున అన్నపూర్ణ రైస్ మిల్ కోత విధించడంతో ఆగ్రహానికి గురవుతూ, ప్రభుత్వం అధికారులపై భగ్గుమంటున్నారు రైతులు. అంతేకాదు ధన్వాడలో మరోసారి సుమారు 35 రోజులుగా, ధాన్యం రవాణా చేయకుండా కాంటా వేయకుండా, గత నాలుగు రోజుల క్రింద నిరసన చేపట్టిన ఫలితం లేకపోవడంతో తిరిగి సోమవారం రోజు పెద్ద మొత్తంలో రైతులు వడ్ల సంచులతో రోడ్డు వీధికి వచ్చి, నిరసన తెలుపుతూ, వడ్ల బస్తాలకు నిప్పంటించడం జరిగింది. ఇక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తాజాగా కొత్త వ్యవహారం తెరపైకి రావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మహాదేవపూర్ మండలంలోని ఒక రైతుకు 900 పైచిలుకు బస్తాలకు గత కొన్ని రోజులుగా లారీల కొరకు మొరపెట్టుకున్న స్పందించని కాంట్రాక్టర్ చివరికి బస్తాకు పది రూపాయల చొప్పున, లారీలను మాట్లాడుకుని వాటిలో ఐదు రూపాయలు నేను కట్టిస్తానని చెప్పి, 3600 రైతు నుండి లారీ యజమానికి అందించి. చివరికి రైస్ బిల్లు నుండి ట్రక్ షీట్ కొరకు, మరో 6,500 ఇస్తేనే ట్రక్ షీట్ ఇవ్వడం జరుగుతుందని, లారీ ఓనర్ చెప్పడం షాక్ కు గురయ్యాడు రైతు, కాంట్రాక్టర్ మాత్రం సగం మీరు ఇవ్వండి మిగితా నేను ఇస్తానని, చెప్పడం జరిగిందని, ధాన్యాన్ని రవాణా చేయాల్సిన కాంట్రాక్టర్, అతని దగ్గర లారీలు లేకపోవడంతో ప్రైవేట్ లారీలకు రైతులకు లింక్ పెట్టి, బస్తాకు పది రూపాయల చొప్పున రైతుల నుండి నేరుగా లారీల యజమానులకు అందిస్తూ,
<span;> రైతులకు ఇబ్బందుల్లోకి నెట్టుతూ తమ కాంట్రాక్ట్ వ్యవహారాన్ని అక్రమంగా కొనసాగించి సొమ్ము చేసుకుంటున్నాడు అని సాక్షాత్తు రైతు అందించిన ఫోన్ పే చెబుతుంది. జిల్లా యంత్రాంగం గత వారం రోజులుగా కాంట్రాక్టర్ అరాచకం అలాగే రైస్ మిల్లు తరుగు పేరుతో కోత పై, స్పందించకపోవడం. ఆదివారం రోజు రాష్ట్ర మంత్రులు ధాన్యం కొనుగోలు రవాణా విషయంలో, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అలాగే తాలుతరుగు పేరుతో కోత విజిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని. చెప్పినప్పటికీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధికారులు మహాదేవపూర్ కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అలాగే అన్నపూర్ణ రైస్ మిల్లు పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని,జిల్లా అధికారులు పెద్దమొత్తంలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, అన్నపూర్ణ రైస్ మిల్లు నుండి భారీగా ముడుపులు తండుకొని రైతుల కష్టాన్ని కన్నీటిని సినిమాలా టిఆకిస్తున్నారు అని చెప్పదానికి ఇవే సాక్షాలు అంటున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రులు ప్రత్యేకంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ కాటారం సబ్ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై అధికారుల నిర్లక్ష్య ధోరణి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు సబ్ డివిజన్ రైతులు మరియు ప్రజలు.



