రెండు చేతులతో దోపిడి, రవాణా తోపాటు భారీ కోత.
ట్రాన్స్పోర్ట్ అక్రమాలే కాదు, ధాన్యం కోతలో కూడా కాంట్రాక్టర్ పాత్ర.కోత పై ప్రభుత్వం కఠిన చర్యలు ఎక్కడ, అన్నపూర్ణ పై కనికరం ఎందుకు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, అన్నపూర్ణ అగ్రోస్ కలిసి ధాన్యం దోపిడి. బస్తాకు మూడున్నర కిలోల, కూతతో దోచుకుంటున్న రైసుమిల్లు కాంట్రాక్టర్. తాజాగా వెలుగులోకి 910 బస్తాలకు,850, లెక్కతో 22 క్వింటాళ్ల కోత. షాప్ కు గురై లబోదిబోమంటున్నా రైతు, ప్రభుత్వ ఆదేశాలు డోంట్ కేర్ అధికారులు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, రైస్ మిల్లుల కోత, పై అధికారులకు భారీ ముడుపులు.!? అయ్యా ముఖ్యమంత్రి వ్యవసాయ మంత్రి కరుణించండి. రైతులు.
రెండు చేతులతో దోపిడి, రవాణా తోపాటు భారీ కోత.
ట్రాన్స్పోర్ట్ అక్రమాలే కాదు, ధాన్యం కోతలో కూడా కాంట్రాక్టర్ పాత్ర.
కోత పై ప్రభుత్వం కఠిన చర్యలు ఎక్కడ, అన్నపూర్ణ పై కనికరం ఎందుకు.
ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, అన్నపూర్ణ అగ్రోస్ కలిసి ధాన్యం దోపిడి.
బస్తాకు మూడున్నర కిలోల, కూతతో దోచుకుంటున్న రైసుమిల్లు కాంట్రాక్టర్.
తాజాగా వెలుగులోకి 910 బస్తాలకు,850, లెక్కతో 22 క్వింటాళ్ల కోత.
షాప్ కు గురై లబోదిబోమంటున్నా రైతు, ప్రభుత్వ ఆదేశాలు డోంట్ కేర్ అధికారులు.
ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, రైస్ మిల్లుల కోత, పై అధికారులకు భారీ ముడుపులు.!?
అయ్యా ముఖ్యమంత్రి వ్యవసాయ మంత్రి కరుణించండి. రైతులు.
మహాదేవపూర్, భూపాలపల్లి: మే 23 (నిజం న్యూస్)
రక్తాన్ని చెమటూర్చి ఆరుకాలంగా పండించిన వరి పంటను రైతుల నుండి నట్టేట ముంచు టకు, అధికారుల ప్రోత్సాహంతో, ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, ధాన్యాన్ని తరలించకుండా, కొనుగోలు కేంద్రాల వద్ద భారీ ఎండ తీవ్రతకు గత నెల పది రోజుల నుండి ధాన్యం ఎండుతున్న క్రమంలో, ఒకవైపు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అరాచకం, సాగిస్తూ అన్నపూర్ణ అగ్రోస్ రైస్ మిల్లు అంకుసాపూర్ కు చేరిన ధాన్యాన్ని, బిల్లు నిర్వాహకుడు కాంట్రాక్టర్ ఒప్పందంతో బస్తాకు మూడు కిలోల వడ్ల కోత విధించడం జరుగుతుంది. బస్తాలను తరలించకుండా అరాచకం చేస్తున్న కాంట్రాక్టర్ అలాగే రైస్ మిల్లుకు తరలించిన ధాన్యంలో పెద్ద కోత ను వహించడంలో కూడా కాంట్రాక్టర్ దె పాత్ర ఉండడం, ఈ వ్యవహారం గత కొన్ని ఏళ్లుగా అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ మరియు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ల చీకటి ఒప్పందం, లక్షల్లో అధికారులకు అందించిన ముడుపులు, ప్రభుత్వ ఆదేశాలను కూడా, లెక్కచేయకుండా ఇటు ధాన్యం రవాణా కొరకు దొంగ లారీల పేరుతో కాంట్రాక్ట్, అలాగే అన్నపూర్ణ రైస్ మిల్లులో భారీ ధాన్యం కోత పై చర్యలకు వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణమని, స్పష్టంగా కనబడుతుంది. ఇక అన్నపూర్ణ రైస్ మిల్లులో బస్తాకు మూడు నుండి మూడున్నర కిలోల కూత పై, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను అధికారులు పరిగణంలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై విరుచుకు పడే పరిస్థితికి దారితీసింది.
కోత పై ప్రభుత్వం కఠిన చర్యలు ఎక్కడ, అన్నపూర్ణ పై కనికరం ఎందుకు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి వడ్ల కొనుగోలు వ్యవహారంలో, తాలు తరుగు పేరుతో కోతపై సహించేది లేదని దీనికి జిల్లా కలెక్టర్లు పూర్తిగా బాధ్యత వహిస్తూ, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది జరగకుండా, కోత విషయంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంకుసాపూర్ గ్రామం వద్ద నిర్వహించబడుతున్న అన్నపూర్ణ అగ్రోస్ ఇండస్ట్రీలో మాత్రం, కోత లేకుంటే లేదు, ధాన్యం అవసరం లేదు, అనే విధంగా, కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కుమ్మక్కు అయి గత కొన్ని ఏళ్లుగా, పెద్ద మొత్తంలో బస్తాకు మూడు నుండి మూడున్నర, విలువల ధాన్యం తాలు తరుగు పేరుతో కోత విధిస్తుంటే, అధికారులు ఎందుకు అన్నపూర్ణ అగ్రోస్ పై చర్యలు ఇందుకు తీసుకోకపోవడంపై, అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇక రైతులు మాత్రం అధికారులు పెద్ద మొత్తంలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తో పాటు రైస్ మిల్లు కోత వ్యవహారంపై, భారీ ముడుపులు అందడంతో నిశ్శబ్దాన్ని వ్యవహరిస్తున్నారని బహిరంగంగా చెప్తున్నారు.
ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, అన్నపూర్ణ అగ్రోస్ కలిసి ధాన్యం దోపిడి.
ప్రస్తుతం ధాన్యం రవాణా కాంట్రాక్టర్ అక్రమాలు గత వారం రోజులుగా జిల్లాలో, ధాన్యం రవాణా అసలు భాగవతం బయటపడి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా హార్ట్ టాపిక్ గా కొనసాగుతున్న క్రమంలో, ట్రాన్స్పోర్ట్ వ్యవహారమే కాదు రైస్ మిల్లు వద్ద వరి కోత కూడా కాంట్రాక్టర్ పుణ్యమేనని, కొత్త సమాచారం తెరపైకి రావడం జరిగింది. గత వారం రోజుల క్రింద కొందరు రైతులు అన్నపూర్ణ అగ్రోస్ లోధాన్యాన్ని సరఫరా చేసిన అనంతరం, భారీ కోత విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడం విశేషం. అన్నపూర్ణ అగ్రోస్ అంటే అంత ఆషామాషీ కాదు, అలాగే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కూడా తక్కువ ఏమీ కాదు, అన్నపూర్ణ ధాన్యం దోపిడీకి తెర వెనుక పాత్రదారుడు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అని ఈ వివాహం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుందని అంటున్నారు రైతులు. తాజాగా ఓ గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు 910 బస్తాల ధాన్యం ప్రతి బస్తాలు 40 యొక్క కిలోల ధాన్యాన్ని తరలించగా, అన్నపూర్ణ ఆగ్రోస్ తాలు తరుగుతో కోత విధిస్తూ,856 బస్తాల ధాన్యం లెక్కచేసి341603 మొత్తం ధాన్యం కింటల్లు అని రసీదు అందించింది. ఈ లెక్క ప్రకారం బస్తాకు మూడు కిలోల కోత విధించడంతో షాక్ కు గురయ్యారు రైతులు. చేసిది విలేఖ ఇచ్చిన రసీదు తీసుకొని గుండెలు బాదుకుంటూ సుమారు 22 క్వింటాళ్ల ధాన్యం కోత విధించడం జరిగిందని ఆగ్రహించారు రైతులు.
ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, రైస్ మిల్లుల కోత, పై అధికారులకు భారీ ముడుపులు.!?
అయ్యా ముఖ్యమంత్రి వ్యవసాయ మంత్రి కరుణించండి. రైతులు.
ఇప్పటికే సబ్ డివిజన్ పరిధిలోని కొనుగోలు కేంద్రాల వద్ద వీళ్ళ టన్నుల ధాన్యం, రవాణా చేయకుండా కాంట్రాక్టర్ రైతులకు ఇబ్బందులు పెడుతున్న క్రమంలో, అదే కాంట్రాక్టర్ కనుసైగల్లో నడుస్తున్న అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీ భారీ కోతల వ్యవహారం, కోత విధించిన ధాన్యంపై వచ్చే కమిషన్ను, కాంట్రాక్టర్ మరియు రైస్ మిల్లు నిర్వాహకులు పంచుకొనుటకు, గత కొన్ని ఏళ్లుగా తాలు తరుగు పేరుతో ఈ కోత వ్యవహారం, రెండు పూలు ఆరు కాయలుగా కొనసాగుతున్న క్రమంలో, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తాలూతరుగు పేరుతో కోతపై, తక్షణ చర్యలు ఆదేశించిన ఇక్కడ అధికారులు మాత్రం ఆగ్రో ఇండస్ట్రీస్ అలాగే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పై, ఏలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడం వెనుక, అధికారులకు భారీ ముడుపులు అందాయని, ప్రభుత్వ ఆదేశాలను సైతం అధికారులు లెక్కచేయకుండా, ఇప్పటికీ లారీలు లేని కాంట్రాక్టర్ ను కొనసాగిస్తూ, బస్తాకు మూడు కిలోల కోత విధిస్తున్న అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీపై, చర్యలు తీసుకోకపోవడం వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే అని, బహిరంగంగా చెబుతున్నారు రైతులు మరియు ప్రజలు. వడ్ల కొనుగోలు వ్యవహారం అగ్రో ఇండస్ట్రీ పెద్ద మొత్తంలో తరుగు పేరుతో కోత, పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే చర్యలు తీసుకోవాలని అంటున్నారు రైతులు.



