స్టేషన్ బెయిల్, చార్జ్‌షీట్‌లో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్
రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్సై

కామారెడ్డి జిల్లా, 21-08-2026 | నిజం న్యూస్: లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్‌స్టేషన్ ఎస్సై దువ్వల అంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన గురువారం (20-08-2026) చోటుచేసుకుంది.
ఫిర్యాదుదారుడి కుమారుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో పాటు, కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసే సమయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్సై రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఫిర్యాదుదారుడి నుంచి రూ.30 వేల లంచాన్ని తన నివాసంలో స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల విచారణకు సంబంధించిన II అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది.
ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో
నిజం న్యూస్



