తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర.. 7,437 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల!

దరఖాస్తుల స్వీకరణ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు ప్రారంభ తేదీలు, అర్హతలు, పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు నియామక మండలి వెల్లడించింది.

హైదరాబాద్ | నిజం న్యూస్

జూలై 30, 2026:

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) తదితర విభాగాల్లో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి (TGPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు ప్రారంభ తేదీలు, అర్హతలు, పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు నియామక మండలి వెల్లడించింది.

 

ఈ నియామక ప్రక్రియ ద్వారా సబ్‌ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఫైర్, జైళ్ల శాఖలలోని పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో చేపట్టిన అతిపెద్ద పోలీస్ నియామకాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు. ఇప్పటికే పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొనే విద్యార్హతలు, వయోపరిమితి, శారీరక అర్హతలు, ఎంపిక విధానం వంటి వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

పోస్టుల వివరాలు:

 

సబ్‌ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు

 

ఎస్ఐ (సివిల్) – 148

 

ఎస్ఐ (ఏఆర్) – 14

 

టీజీఎస్‌పీ ఎస్‌ఐ – 12

 

ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌ ఎస్‌ఐ – 3

 

ఎస్ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) – 23

 

 

కానిస్టేబుల్ పోస్టులు

 

కానిస్టేబుల్ (సివిల్) – 3,697

 

కానిస్టేబుల్ (ఏఆర్) – 1,052

 

పీటీవో కానిస్టేబుల్ – 20

 

కానిస్టేబుల్ మెకానిక్ – 7

 

ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌ కానిస్టేబుల్ – 44

 

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) కానిస్టేబుల్ – 1,038

 

 

ఫైర్ & జైళ్ల శాఖ

 

స్టేషన్ ఫైర్ ఆఫీసర్ – 39

 

ఫైర్ ఫైటర్ – 751

 

డిప్యూటీ జైలర్ (పురుషులు) – 14

 

డిప్యూటీ జైలర్ (మహిళ) – 1

 

వార్డర్ (పురుషులు) – 196

 

వార్డర్ (మహిళలు) – 12

 

 

పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు తేదీలు, పరీక్షల షెడ్యూల్, ఎంపిక విధానం తదితర వివరాలను త్వరలో తెలంగాణ పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచించారు.

 

— శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button