ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్

హుజూర్‌నగర్ పట్టణంలోని నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకర పరిస్థితిలో ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హుజూర్‌నగర్ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్

 

హుజూర్‌నగర్ పట్టణంలోని నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకర పరిస్థితిలో ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ట్రాన్స్ ఫార్మర్కు అనుసంధానమైన విద్యుత్ కేబుళ్లు కాలిపోయినట్లు కనిపించడంతో పాటు, బహిర్గతంగా వేలాడుతూ ఉండటం వల్ల ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు.

 

ఈ ట్రాన్స్ ఫార్మర్ సమీపంలో టీ స్టాళ్లు దుకాణాలు రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో చిన్నారులు వృద్ధులు వ్యాపారులు ఎప్పటికప్పుడు ఈ మార్గంలో సంచరిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత విద్యుత్ అధికారులు ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. స్థానికుల కథనం ప్రకారం ట్రాన్స్ ఫార్మర్ నుండి పొగలు రావడం, కేబుళ్లు కాలినట్లు కనిపించడం తరచూ జరుగుతోందని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రజల డిమాండ్….

 

అత్యవసర చర్యలు తీసుకోవాలి…

 

ట్రాన్స్ ఫార్మర్ను తక్షణమే మరమ్మతు చేయాలని ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను మార్చాలని అవసరమైతే భద్రతా కంచె ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ట్రాన్స్ ఫార్మర్ ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేశారు? కాలిపోయిన కేబుళ్లను ఇప్పటివరకు ఎందుకు మార్చలేదు?

 

ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా?

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button