‎పేద విద్యార్థులకు బాంధవుడు మధు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కలలకు శ్రీకారం. విధులే కాదు  విద్యార్థుల బాధ్యత కూడా ఉపాధ్యాయుడు మధుకే సొంతం.

‎పేద విద్యార్థులకు బాంధవుడు మధు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కలలకు శ్రీకారం.

విధులే కాదు  విద్యార్థుల బాధ్యత కూడా ఉపాధ్యాయుడు మధుకే సొంతం.

సొంత ఖర్చుతో కార్పొరేట్ యూనిఫాం అందిస్తున్న మధు.

మండలంలో 800 పైచిలుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీ షర్ట్ యూనిఫామ్.

మధు విధి బాధ్యత, రాష్ట్ర గవర్నర్ పురస్కారం, గూగుల్ సర్చ్ ఇంజన్ లోకి నమోదు చేసింది.

‎మధు సేవలు అభినందనీయం అంటున్నారు జిల్లా వాసులు.

‎మహాదేవపూర్, భూపాలపల్లి: జూన్ 23( నిజం న్యూస్)

‎మధు అనే పేరు ప్రభుత్వ పాఠశాల రంగంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ పేరు చెప్పగానే, ప్రజలు మరియు తల్లిదండ్రులు అలాగే విద్యార్థుల్లో ఎంతో గౌరవం, చెప్పకుండానే వచ్చేస్తుంది. మడక మధు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అన్ని ఉపాధ్యాయుల ఇతను కూడా ప్రతిరోజు, తన విధుల నిర్వహణకై పాఠశాలకు వచ్చి విద్యార్థులకు విద్యను అందించడం సహజంగా ఒక ఉద్యోగిగా తోటి ఉద్యోగులతో కలిసి విధులు నిర్వహించడం జరుగుతుంది. కానీ మడక మధు అంటేనే తల్లిదండ్రుల్లో ఒక గౌరవం, ప్రజల్లో ఒక భరోసా, విద్యార్థుల్లో అంతులేని ప్రేమ, ఏదైనా సాధించుతాం, అనుకున్న లక్ష్యానికి చేరుతాం దానికి కేరాఫ్ “మధు సార్” అని క్రేజ్ విద్యార్థుల్లో కనబడుతుంది. ఒక సాధారణ ఉపాధ్యాయునికి, విద్యార్థులు ప్రజలు తల్లిదండ్రుల్లో ఇంత ఆదరణ ఎలా సాధ్యం అనేది ఒక ప్రశ్న కానీ మడక మధుకర్, ఉపాధ్యాయ వృత్తిలో చదువు చెప్పి ఇంటికి వెళ్లే రకం కాదు, మారుతున్న కాలానికి విద్యార్థులకు ఉన్నత శిఖరాలకు చేర్చే విధంగా, విద్యార్థుల్లో నైపుణ్యత వెలికి తీయడమే కాకుండా, చివరి బెంచ్ లో కూర్చున్న విద్యార్థికి కూడా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ విద్యార్థిగా మార్చే, సత్తా కూడా మధుకర్ ఉంది. అంతేకాదు ప్రభుత్వ పాఠశాల పిల్లలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు విద్యలోనే కాదు, ఆర్థికంగా కూడా మేము “గౌట్ స్టూడెంట్” లుక్ ఇట్ థిస్, ఇస్ అవర్ యూనిఫామ్” విద్యార్థులు నిరాశ చెందకుండా, యూనిఫామ్ ఆర్థిక భారం పడకుండా, టీ షర్టులు, ట్రెజర్స్ లను సొంత ఖర్చుతో అందించడం, అలాగే వారికి సన్నిహితంగా ఉన్న ఎన్ఆర్ఐ నుండి కూడా ప్రోత్సాహంతో, టీ షర్ట్ ట్రెజర్స్ లను ఇప్పటికే మండలంలో సుమారు 1000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించి దాతృత్వాన్ని చాటుకున్నటువంటి ఉపాధ్యాయుడు మడక మధుకర్.

‎ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కలలకు శ్రీకారం.

మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మడక మధుకర్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కలలకు శ్రీకారం చుట్టుటకు ఒక నిజమైన ఉపాధ్యాయునిగా తమ కర్తవ్యాన్ని నెరవేర్చడంలో, విద్యార్థులకు విద్యా పరంగా, వెన్నంటూ ఉండడం, పాఠశాల విద్య పూర్తయిన విద్యార్థులకు సైతం, వారి ఆర్థిక పరిస్థితులు విద్యకు అడ్డు రాకూడదని, ఇంటర్ ,డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు సైతం, తన పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్థిక భరోసా కలిగిస్తూ వారి కలలకు శ్రీకారం చుడుతున్నాడు ఉపాధ్యాయుడు మడక మధుకర్. విద్యారంగంలో విద్యార్థులకు విద్యపై సాంకేతిక నైపుణ్యం సలహాలతో, విద్యార్థులు ముందుకు దూసుకు వెళ్లడం లో కూడా ఉపాధ్యాయుడు మధుకర్ కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. మధుకర్ ఉపాధ్యాయుడిగా తన బాధ్యత కర్తవ్యం నెరవేర్చడమే కాకుండా, విద్యను నమ్ముకొని విద్య తనకు ఉపాధ్యాయునిగా గుర్తించి విద్యతోనే తాను ఉపాధి పొందుతున్నానని భావిస్తున్న ఒక స్వచ్ఛమైన ఉపాధ్యాయుడిగా, విద్యార్థుల బాధ్యతలు కూడా తనకె సొంతం అనేలా విద్యార్థులకు చెదోడుగా ఉండడం ఉపాధ్యాయుడు మధుకే సాధ్యం కావడం జరిగింది.

‎సొంత ఖర్చుతో కార్పొరేట్ యూనిఫాం అందిస్తున్న మధు.

మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసిస్తున్న ఒకటవ తరగతి నుండి మొదలుకొని పదవ తరగతి విద్యార్థుల వరకు, ప్రభుత్వం అందించే ఉచిత యూనిఫామ్ ధరిస్తున్న విద్యార్థులకు. పలు సందర్భాల్లో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు వారానికి రెండు రోజులపాటు స్పెషల్ యూనిఫామ్ టీషర్ట్ ట్రావ్జర్ లాంటివి ధరించిన ఆ ప్రైవేట్ విద్యార్థులకు చూసి, ఇబ్బంది పడకుండా ఉండుటకు గత సంవత్సరం 2025 నుండి ఉపాధ్యాయుడు మడక మధుకర్ తన సొంత ఖర్చుతో పాటు, అతని ఏన్ ఆర్ ఐ, స్నేహితులతో చర్చించి మహాదేవపూర్ లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలురు మరియు బాలికల పాఠశాలలకు టీ షర్ట్ మరియు ట్రావ్జర్ లను అందించే కార్యక్రమం ప్రారంభించాడు. గత సంవత్సరం నుండి నేడు పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడుస్తున్న క్రమంలో తాజాగా మండలంలోని పెద్దంపేట, రాపల్లి కోట, ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు టీ షర్ట్, ట్రావ్జర్స్ లను అందించడం జరిగింది. ఇలా ఇప్పటికీ వాడుక మధుకర్ తన సొంత ఖర్చుతో మండలంలోని సుమారు 800 మంది విద్యార్థులకు టీ షర్ట్ లను అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో విడుదలవారీగా మిగిలిన పాఠశాల విద్యార్థులకు కూడా టీ షర్ట్ ట్రావ్జర్స్ లను సాధ్యమైనంత త్వరగా అందిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని చెబుతున్నారు తల్లిదండ్రులు.

‎మధు విధి బాధ్యత, రాష్ట్ర గవర్నర్ పురస్కారం, గూగుల్ సర్చ్ ఇంజన్ లోకి నమోదు చేసింది.

ఒక సాధారణ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహించవలసిన ఉపాధ్యాయుడు విద్య తమ బాధ్యత, విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగడమే తన లక్ష్యంగా భావించుకున్న మడక మధుకర్, విద్యార్థులకు విద్యలో అలాగే వారి ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డుకాకూడదని ఒక దృఢమైన సంకల్పంతో, ముందుకు దూసుకు వెళ్తూ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక బాలికల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, “మూగ” అంగవైకల్యం కలిగిన వ్యక్తుల సంభాషణ, అది కూడా స్వచ్ఛమైన ఫ్లూయెంట్ ఆంగ్ల భాషలో, వారి ప్రదర్శన రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దక్కని గౌరవం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించిన ఘనత మడక మధుకర్ కి దక్కింది. అంతేకాదు ప్రపంచాన్ని శాసిస్తున్న ‘గూగుల్” సెర్చ్ ఇంజన్లో కూడా మూగ అంగవైకల్యం కలిగిన వ్యక్తుల సంభాషణ కు సంబంధించి న ప్రదర్శన తోపాటు గవర్నర్ చేతుల మీదుగా విద్యార్థులు తీసుకున్న పురస్కారం. గూగుల్ సర్చ్ ఇంజన్లో నేటికీ “గూగుల్ సర్చ్ లో కొనసాగడం  జరుగుతుంది. విధులు సమాప్తం చేసుకొని ఇంటికి వెళ్లి తన పిల్ల పాపలతో సంతోషంగా గడపాలనుకునే ఈ రోజుల్లో, మడక మధు లాంటి ఉపాధ్యాయుడు మహాదేవపూర్ మండలంలో అలాగే మండల కేంద్రంలోని బాలికల పాఠశాల లో ఉపాధ్యాయునిగా రావడం పాఠశాల తో పాటు మహాదేవపూర్ మండల ప్రజలు మరియు విద్యార్థుల కు ఒక అదృష్టంగా భావించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మడక మధుకర్ లాంటి ఉపాధ్యాయుడు ప్రతి పాఠశాలకు ఉంటే, ప్రభుత్వ పాఠశాలల పై ప్రజలకు మరియు విద్యార్థులకు ఎంతో నమ్మకం, అలాగే పేద కుటుంబాల పిల్లలకు సైతం మధుకర్ లాంటి ఉపాధ్యాయుడు సరస్వతి తల్లి ఇచ్చిన ఒక వరం లా మారుతుంది. అందుకే మడక వధూకర్ పేరు చెబితేనే జిల్లా మరియు మండలంలోని ప్రజలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైతం ఉపాధ్యాయుడు మధుకర్ కు ఎంతో గౌరవాన్ని అందిస్తారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button