ఆగని రైస్ మిల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అరాచకం.

రైతుల పైసలతోనే లారీల్లో ధాన్యం రవాణా.


  1. ఆగని రైస్ మిల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అరాచకం.

రైతుల పైసలతోనే లారీల్లో ధాన్యం రవాణా.

మహాదేవపూర్, భూపాలపల్లి: మే 26( నిజం న్యూస్)

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు రవాణా తో పాటు రైస్ మిల్లు వద్ద కోత విధించడంపై, చర్యలకు ఆదేశించింది, ప్రభుత్వ మంత్రులు, పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని కాటారం మహాదేవపూర్ సబ్ డివిజన్ పరిధిలో, ప్రభుత్వ ఆదేశాలకు లెక్కలేదు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ మరియు, అన్నపూర్ణ రైస్ మిల్, అధికారులతో చీకటి ఒప్పందాన్ని ఏర్పరచుకొని, పెద్ద మొత్తంలో ధాన్యం కోత, కల్లాల నుండి రైతులు స్వయంగా బస్తాకు పది రూపాయల చొప్పున, లారీల చార్జీలు చెల్లించడం జరుగుతుంది. తాజాగా మహదేవపూర్ మండలం తో పాటు కాటారం మండలంలో, ధాన్యం రవాణా మరియు కోత పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కానీ జిల్లా అధికారులు, కాంట్రాక్టర్ మరియు రైస్ మిల్లు పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కాలయాపన చేయడం సబ్ డివిజన్ పరిధిలో అన్నపూర్ణ రైస్ మిల్ తో పాటు కాంట్రాక్టర్ అరాచకం ఇంకా కొనసాగుతూ, రోజుకు ఒక్క సెంటర్ నుండి, రైతులే లారీల డబ్బులు అందించి బస్తాలు రవాణా చేయడం, రైస్ మిల్లు వద్దకు వెళ్లిన బస్తాలను బస్తాకు రెండు కిలోల నర, చొప్పున కోత విధించి ట్రక్ షీట్ వెనుక భాగంలో రాసి ఇచ్చిన వివరాలు చూపుతున్నారు రైతులు. బస్తాకు పది రూపాయల చొప్పున కిరాయి చెల్లించడం అలాగే ప్రతి బస్తాకు రెండున్నర కిలోల కోతకు, ఒప్పుకుంటేనే రైతులు ధాన్యం రవాణా విక్రయానికి సై అనాలి లేదంటే ధాన్యం కల్లానికి పరిమితం చేసుకునే దుస్థితికి తీసుకురావడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ట్రాన్స్పోర్ట్ కిరాయి తోపాటు బస్తాకు రెండున్నర కిలోల కోత కు నిరాకరించలేక ధాన్యాన్ని రవాణా చేయడం జరుగుతుంది అంటున్నారు రైతులు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button