‎రిజర్వ్ ఫారెస్ట్ లో రహదారి కొరకు నిర్మాణం. ‎

‎దర్జాగా అటవీ లో, కాలువలపై సిసి రోడ్డు నిర్మాణం ఎలా. గతంలో ఫారెస్ట్ అన్న అధికారులు, ఇప్పుడు ఏలా నిర్మాణాలు చేపడుతున్నారు. ‎

‎రిజర్వ్ ఫారెస్ట్ లో రహదారి కొరకు నిర్మాణం.

‎దర్జాగా అటవీ లో, కాలువలపై సిసి రోడ్డు నిర్మాణం ఎలా.

గతంలో ఫారెస్ట్ అన్న అధికారులు, ఇప్పుడు ఏలా నిర్మాణాలు చేపడుతున్నారు.

‎శాఖ నే రిజర్వ్ ఫారెస్ట్ లో రహదారి నిర్మాణం చేయడం ఆశ్చర్యం.

నిర్మాణం పై పొంతనలేని సమాధానాలు, ఉన్నత అధికారుల ఆదేశాలు.

పుష్కరాల నిధులతో, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, చేస్తున్నాం, అన్న అధికారి.

పుష్కరాలకు రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధం ఏమిటి,

పుష్కరాల నిధులు రిజర్వ్ ఫారెస్ట్ లో రహదారి ఏర్పాటుకు ఎలా నిర్మిస్తారు.

రిజర్వ్ ఫారెస్ట్ లో నిర్మాణాలపై ఉన్నత అధికారులు స్పందించాల్సిన అవసరం.

మహాదేవపూర్ భూపాలపల్లి,మే16( నిజం న్యూస్)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని, బీరసాగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో  వర్షపు నీరు వెళ్ళుటకు ఉన్న కల్వర్టులపై సిసి రోడ్డు వేసి రహదారి ఏర్పాటు చేయడం, మండలం లో రిజర్వ్ ఫారెస్ట్ లో రహదారి నిర్మాణం పై చర్చనీయ అంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో, ఇదే బీరసాగర్ ఫారెస్ట్ లో రహదారి నిర్మాణం కొరకు శిలాఫల్కం వేస్తే, అధికారులు రిజర్వ్ ఫారెస్ట్ అని, ఆశిలా పల్కానికి ధ్వంసం చేసి రహదారి నిర్మాణం చేపట్టకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ అయిన బీరసాగర్, ఇప్పుడు రహదారుల కొరకు కలబాట్లపై సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడాన్ని ప్రశ్నిస్తూ, రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలు మారాయా ఫారెస్ట్ లో ఏమైనా నిర్మాణాలు చేసుకోవచ్చా, ఇది అందరికీ వర్తిస్తుందా లేదా అటవీ శాఖ అధికారుల కేనా రిజర్వ్ ఫారెస్ట్ లో నిర్మాణాల చట్టమని చెబుతున్నారు ప్రజలు.

దర్జాగా అటవీ లో, కాలువలపై సిసి రోడ్డు నిర్మాణం ఎలా.

బీరసాగర్ మహాదేవపూర్ మండలంలోని ఒక దట్టమైన అటవీ ప్రాంతం, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న దట్టమైన అడవి నుండి, పాదాచార్యులు అటవీ సంపద ఉత్పత్తి కొరకు, ఎడ్ల బండ్లు కాలి నడక ద్వారా కన్నేపల్లి బీర సాగర్ తో పాటు కుదురుపల్లి ఎడపల్లి గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు, బిరసాగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఏర్పడి ఉన్న చిన్న రహదారి ద్వారా, కాలి నడకతో కాలేశ్వరం తో తో పాటు చుట్టుపక్కల ఉన్న అడవిలో పనుల నిమిత్తం వెళ్లడం కోసం ఉపయోగించుకుంటారు. ద్విచక్ర వాహనాలు కూడా నడవలేనటువంటి రిజర్వ్ ఫారెస్ట్ లో, సుమారు 6 పెద్ద కలవట్లు ఉన్నాయి, వర్షాకాలం ఈ కలవట్లు వర్షపు నీరుతో నిండి, అడవిలోని భారీ వృక్షాలకు నీరు అందించి గోదావరిలో కలవడం జరుగుతుంది. ఇలా రిజర్వ్ ఫారెస్ట్ లో ఏర్పడినటువంటి కలవట్లపై, సీసీ రోడ్డు నిర్మాణం, అది కూడా ఫారెస్ట్ శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్మించడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. బీరసాగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో కల్వట్లపై సిసి రోడ్ల నిర్మాణం ఇప్పుడు చర్చనీయంగా మారింది.


‎గతంలో ఫారెస్ట్ అన్న అధికారులు, ఇప్పుడు ఏలా నిర్మాణాలు చేపడుతున్నారు.

వీర సాగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని అధికారులు గత ప్రభుత్వం, మాజీ శాసనసభ్యుడు పుట్ట మధుకర్ హయాంలో, బీర సాగర్ అటవీ ప్రాంతంలో జాతీయ రహదారి నుండి కన్నెపల్లి వరకు, రహదారి నిర్మాణం కొరకు, నిధులు కేటాయించి రహదారి నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తే, రిజర్వ్ ఫారెస్ట్ లో రహదారి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉండవని, శిలాఫలకాన్ని తొలగించిన ఫారెస్ట్ అధికారులు. ఇప్పుడు అదే రిజర్వ్ ఫారెస్ట్ లో, పెద్ద పెద్ద కలువట్టలపై సి సి రోడ్డు వేసి, భారీ వాహనాల రాకపోకలకు వేసులు బాటు కల్పించడం, అది కూడా అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు జోరుగా కొనసాగడం, రిజర్వ్ ఫారెస్ట్ లో రహదారి నిర్మాణం పై ఉన్నత అధికారుల ఆదేశాలు వాస్తవానికి ఉన్నాయా, రిజర్వ్ ఫారెస్ట్ అటవీ శాఖ సంరక్షణ చట్టం 1980, 1967, లో ఏమైనా మార్పు చేసి రిజర్వ్ ఫారెస్ట్ లో నిర్మాణం చేయాలని, కొత్త చట్టాన్ని పరిగణంలోకి తీసిందేమో అందుకే ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ లో రహదారి నిర్మాణం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు మండల వాసులు.

‎నిర్మాణం పై పొంతనలేని సమాధానాలు, ఉన్నత అధికారుల ఆదేశాలు.

బీరసాగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో, అటవీ శాఖ పర్యవేక్షణలో సీసీ రోడ్డు నిర్మాణం మండలంలో కాస్త హాట్ టాపిక్ గా మారడంతో, నిజం న్యూస్, స్థానిక అటవీ శాఖ అధికారికి వివరణ కోరగా, అధికారి పొంతనలేని సమాధానాలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న కల్వట్లపై సిసి రోడ్డు నిర్మాణం ఇలా సాధ్యమని అడగగా, అధికారి ముందుగా తమ ఫారెస్ట్ వాహనాలు పెట్రోలింగ్ కొరకు అని, అటవీ శాఖ వాహనాల కొరకు ఫారెస్ట్ లో రోడ్డు నిర్మాణం ఇలా ఏమైనా ఉన్నత అధికారుల ఆదేశాలు ఉన్నాయా, అని అడగగా, తిరిగి అధికారి, కేవలం ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది, జీవో కానీ లేదా లిఖితపూర్వకంగా, ఇవ్వలేదని చెప్పగా, నిజం న్యూస్ అది ఇలా సాధ్యం దానికి నిధులు ఎలా సమకూరుస్తారు అని అడగగా, అధికారి మరోసారి, ఇది పుష్కరాల కొరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పుష్కరాలకు సంబంధించిన నిధుల నుండి పరులు చేపడుతున్నామని, పుష్కరాల నిధులకు ఫారెస్ట్ లో పనులు నిర్వహించడం ఎలా సాధ్యం, పుష్కరాలకు రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధం ఏమిటి, పుష్కరాల నిధులతో రిజర్వ్ ఫారెస్ట్ లో రహదారి నిర్మాణం ఎలా చేస్తారు అని నిజం న్యూస్ అడగడంతో, ఉన్నత అధికారులు తమకు చెప్పారు మేము పాటిస్తున్నాము అని పొంతన లేని సమాధానం ఇచ్చిన అటవీ శాఖ అధికారి.

రిజర్వ్ ఫారెస్ట్ లో నిర్మాణాలపై ఉన్నత అధికారులు స్పందించాల్సిన అవసరం.

మహాదేవపూర్ మండలంలోని బీరసాగర్ ఫారెస్ట్ లో అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలను తూట్లు పొడుస్తూ, దశాబ్దాలుగా రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో ఇలాంటి రహదారి నిర్మాణాలు చేపట్టకుండా ఉన్నప్పటికీ, ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలను తూట్లు పొడిసి, ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణలోనే, రిజర్వ్ ఫారెస్ట్ లో కలవట్లపై సిసి రోడ్లు నిర్మించి, వాహనాల రాకపోకలకు వెసులుబాటు కల్పించేలా చేయడం, ఇది అటవీ సంరక్షణ చట్టానికి విరుద్ధం కాదా, 1967 రిజర్వ్ ఫారెస్ట్ యాక్టులో నిర్మాణాలు రోడ్లు చేపట్టడం నిషేధం అన్న విషయం, మండల ఫారెస్ట్ అధికారులకు, తెలువదా లేక ఎవరి అండ తో రిజర్వ్ ఫారెస్ట్ లో, రహదారి నిర్మాణం చేయడం జరుగుతుంది. ఉన్నత అధికారుల ఆదేశాలు కూడా లేకున్నప్పటికీ, దర్జాగా అటవీశాఖ అధికారులే నిర్మాణాలు చేపట్టడంపై, తక్షణమే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫారెస్ట్, అలాగే కన్జర్వేటర్ ఆ ఫారెస్ట్ విచారణ చేపట్టి చర్యలు తీసుకొని రిజర్వ్ ఫారెస్ట్ ను, రహదారిగా మారకుండా కాపాడవలసిన అవసరం ఉందని అంటున్నారు మండల వాసులు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button