మండల స్థాయి నుండి నకిలీ విత్తనాలకు కట్టడి చేయాలి, కలెక్టర్.

మండల స్థాయి నుండి నకిలీ విత్తనాలకు కట్టడి చేయాలి, కలెక్టర్.

మండల స్థాయి నుండి నకిలీ విత్తనాలకు కట్టడి చేయాలి, కలెక్టర్.

‎భూపాలపల్లి మహాదేవపూర్ మీ 11( నిజం న్యూస్)

మండల స్థాయి నుండి నకిలీ విత్తనాల విక్రయాలపై పటిష్టమైన నిఘా పెట్టి కట్టడి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐ డి ఓ సి కార్యాలయంలో నకిలీ విత్తనాల నియంత్రణపై రెవెన్యూ మరియు పోలీస్ తో పాటు ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండల స్థాయి నుండి రెవెన్యూ పోలీస్ అలాగే జిల్లా స్థాయి అధికారుల వరకు నకిలీ విత్తనాలపై పటిష్టమైన నిఘా పెట్టి, కట్టడి చేయాలని అలాగే వ్యవసాయ శాఖ సమన్వయంతో కలిసి పనిచేయాలని అన్నారు కలెక్టర్. నకిలీ విత్తనాల కట్టడిపై జిల్లా మరియు మండల స్థాయిలో నిరంతర మానిటరింగ్ నిర్వహించాలని స్పష్టం చేశారు, నకిలీ విత్తనాల విక్రయాలు జరిపితే, డీలర్ల లైసెన్సులు రద్దు తో పాటు పోలీస్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహం పచ్చి రొట్టె ఎరువు వినియోగాన్ని అలాగే నానో యూరియా వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు, అలాగే ఫార్మర్ రిజిస్ట్రీ పురోగతిపై క్లస్టర్ వారిగా సమీక్షించారు కలెక్టర్, 82% గురి కొత్తపల్లి క్లస్టర్లు రిజిస్టర్ నమోదు కావడంతో అభినందించారు కలెక్టర్, అలాగే జిల్లాలో 67% ఫార్మా రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొంటూ ప్రతిరోజు ఫార్మ రిజిస్టరీ పురోగతి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే సాగు సమయానికి అవసరమయ్యే విత్తనాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని విత్తనాల నాణ్యతలో ఎలాంటి రాజీ పడుద్దని, అధిక దిగుబడి కొరకు నాణ్యమైన విత్తనాలు ఎంపిక కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు నకిలీ విత్తనాల కట్టడికై ట్రాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి అక్రమ రవాణా నిలువ అలాగే విక్రయాలపై, కఠిన చర్యలకు ఆదేశించారు కలెక్టర్. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button