రంగు చూసి మోసపోకండి…చూడటానికి ఆకర్షణీయం… లోపల మాత్రం విషతుల్యం
మార్కెట్లో కనిపించే తళతళలాడే పసుపు రంగులో అందంగా కనిపించే మామిడిపండ్లు సహజంగా పండినవి కావు. పండ్లను త్వరగా పండించి, ఎక్కువ లాభాలు గడించడం కోసం వ్యాపారులు 'కాల్షియం కార్బైడ్' వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, లోపల మాత్రం విషతుల్యమై ఉంటాయి.

కాల్షియం కార్బైడ్ వాడకాన్ని పూర్తిగా నిషేధించిన ప్రభుత్వం
ఇథిలిన్ గ్యాస్’ను మాత్రమే వాడాలని సూచన
మార్కెట్లో మనకు కనిపించే పసుపు రంగులో అందంగా కనిపించే మామిడిపండ్లు సహజంగా పండినవి కావు.
పండ్లను త్వరగా పండించి, ఎక్కువ లాభాలు గడించడం కోసం వ్యాపారులు ‘కాల్షియం కార్బైడ్’ వంటి ప్రమాదకరమైన రసాయనాలను వాడుతున్నారు. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, లోపల మాత్రం విషతుల్యమై ఉంటాయి.
సహజంగా పండిన మామిడిపండ్లను గుర్తించడం ఎలా?
వాసన:
సహజంగా పండిన మామిడిపండు కాడ భాగం నుండి తీయటి బలమైన సువాసన వస్తుంది. రసాయనాలతో పండినవి వాసన తక్కువగా లేదా అసహజంగా ఉంటాయి.
రంగు:
సహజమైన పండ్లు పూర్తిగా పసుపు రంగులో కాకుండా పసుపు మరియు ఆకుపచ్చ రంగుల మిశ్రమంగా కనిపిస్తాయి. కేవలం ఒకే రంగులో ఉంటే అవి కృత్రిమంగా పండినవి కావచ్చు.
నీటి పరీక్ష:
మామిడిపండును నీటిలో వేసినపుడు సహజంగా పండినది నీటిలో మునిగి పోతుంది. కృత్రిమంగా రసాయనాలతో పండించినవి నీటిలో వేస్తే మునిగిపోవు.
మచ్చలు:
సహజమైన పండ్లపై నల్లటి మచ్చలు ఉండవు. మామిడి పండ్లపై తెల్లటి పొడి లాంటి పదార్థం ఉంటే అది కృత్రిమంగా ముగ్గిన పండ్లుగా గుర్తు.
కృత్రిమంగా ముగ్గించిన మామిడి పండ్లు వలన కలిగే నష్టాలు:
కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలు వాడిన పండ్లను తినడం వల్ల కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇవి శ్వాసకోస సంబంధిత ఇబ్బందులకు, గొంతు సమస్యలకు దారితీయవచ్చు. అందుకే FSSAI మన దేశంలో కాల్షియం కార్బైడ్ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. దీనికి బదులుగా అనుమతించిన స్థాయిలో ‘ఇథిలిన్ గ్యాస్’ను మాత్రమే వాడాలని సూచిస్తోంది.



