తగు జాగ్రత్తలతో వడదెబ్బ నుంచి రక్షించుకుందాం
శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు బాధితుడిని వెంటనే నీడలోకి లేదా ఏసీ ఉన్న గదిలోకి మార్చాలనీ. తడి గుడ్డతో శరీరాన్ని తుడుస్తూ, ఫ్యాన్ కింద ఉంచాలి.

డా. వేణు గోపాల్ నాయక్
సన్ స్ట్రోక్ (వడదెబ్బ) గురించి లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ నాయక్ మాట్లాడుతూ
శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు బాధితుడిని వెంటనే నీడలోకి లేదా ఏసీ ఉన్న గదిలోకి మార్చాలనీ. తడి గుడ్డతో శరీరాన్ని తుడుస్తూ, ఫ్యాన్ కింద ఉంచాలి. వీలైతే ఐస్ ప్యాక్‌లను మెడ, చంకలు మరియు గజ్జల భాగంలో ఉంచితే ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుందనీ స్పృహలో ఉంటేనే నీళ్లు, ఓఆర్‌ఎస్ (ORS), కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ తాగించాలనీ, ఒకవేళ బాధితుడు స్పృహ కోల్పోతే నోటి ద్వారా ఏమీ ఇవ్వకూడదన్నారు*
గాలి తగిలేలా బిగుతుగా ఉన్న దుస్తులను సడలించాలి
వడదెబ్బ తగిలిన వ్యక్తికి విపరీతమైన జ్వరం (104°F కంటే ఎక్కువ), మూర్ఛ (Seizures), లేదా స్పృహ తప్పడం వంటివి జరిగితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించాలన్నారు
దాహం వేయకపోయినా ప్రతి గంటకు ఒకసారి నీళ్లు తాగుతుండాలినీ. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకపోవడం మంచిదన్నారు
బయటకు వెళ్ళేటప్పుడు లేత రంగులో ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. తలకి టోపీ లేదా గొడుగు వాడటం మర్చిపోవద్దన్నారు
ఈ కార్యక్రమంలో cho పద్మ, సూపర్వైజర్ పద్మ, ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు



