గొడవలకు అడ్డాగా మారుతున్న ధాబాలు
ఇరు వర్గాల మధ్య మద్యం తాగే సమయంలో మాట మాట పెరిగి ఘర్షణ జరిగినట్లు, ఈ ఘర్షణలో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గానికి చెందిన ఒక వ్యక్తిని బీరు సీసాతో తలపై కొట్టినట్లు సమాచారం.

*గరిడేపల్లి లో…..ఇరు వర్గాల మధ్య ఘర్షణ*
*వ్యక్తికి గాయాలు*
*ప్రశాంతంగా ఉన్న పొనుగోడును రణరంగంగా మారకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఆవేదన*
గరిడేపల్లి జూలై 5 (నిజం చెపుతాం)
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని అబ్బిరెడ్డి గూడెం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న పంజాబీ దాబాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆదివారం రోజు సాయంత్రం జరిగిన ఘర్షణలో పొనుగోడు గ్రామానికి చెందిన వ్యక్తికి గాయాలైనట్టు సమాచారం.
ఇరు వర్గాల మధ్య మద్యం తాగే సమయంలో మాట మాట పెరిగి ఘర్షణ జరిగినట్లు, ఈ ఘర్షణలో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గానికి చెందిన ఒక వ్యక్తిని బీరు సీసాతో తలపై కొట్టినట్లు సమాచారం.

ఈ గొడవలో వర్గాలు రెండు వర్గాలు కూడా ఒకే రాజకీయ పార్టీకి సంబంధించినవి కావున ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఘటనా స్థలంలోనే ఉన్నారు. వారు ఇరువురు ఘర్షణను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఘర్షణ సమాచారం తెలుసుకొని పోలీసులు వెంటనే ఇరు వర్గాలను చెదరగొట్టి గొడవను సద్దుమనిచి, గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గరిడేపల్లి ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ పొనుగోడు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఘటన జరిగిన పంజాబీ దాబాకు మద్యం విక్రయించే పర్మిషన్ ఉన్నదా లేదా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగ రాత్రి పది గంటల లోపే బెల్టు షాపులను దాబాలను మూసివేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుతున్నారు.



