మరికొద్ది సేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..!
వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలని అధికారుల సూచన..!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను నేడు ఉదయం 10:31 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10.57 లక్షల మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
రిజల్ట్స్ ఎక్కడ చూడాలి..?
1. బోర్డు అధికారిక వెబ్సైట్: resultsbie.ap.gov.in లేదా bie.ap.gov.in
2. థర్డ్ పార్టీ వెబ్సైట్లు: manabadi.co.in, schools9.com
విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను అందిస్తున్నారు. 9552300009 నంబర్‌కు “Hi”అని మెసేజ్ పంపి ఫలితాలు పొందవచ్చు.
ఫలితాలు విడుదలైన వెంటనే సర్వర్లపై ఒత్తిడి పెరిగి వెబ్సైట్లు నెమ్మదించే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఓపికగా ప్రయత్నించాలని లేదా వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.



