డెడ్ స్టోరేజ్ దిశగా తెలంగాణ జలాశయాలు.. ఇలా కొనసాగితే తెలంగాణలో తీవ్ర సంక్షోభం

చివరి దశలో ఉన్న రబీ సీజన్
ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నీరు తరలించుకుపోతున్నా, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ రైతులు
శ్రీశైలం ప్రాజెక్టులో 215.81 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం కేవలం 43.75 టీఎంసీలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 312.05 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 176.06 టీఎంసీలు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 80.50 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 28.85 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీల సామర్థ్యానికి 9.54 టీఎంసీలు, సింగూర్‌లో 29.91 టీఎంసీల సామర్థ్యానికి 7.46 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టులో 9.66 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 4.71 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండడం ఆందోళన కలిగించే విషయమని చెప్తున్న నిపుణులు.
ఇదే తరహాలో కొనసాగితే రాష్ట్రంలో సాగు, తాగు నీటికి తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.



