అద్దె ఇంటికి అధికార ముద్ర..! కిరాయికున్నా, బకాయిలున్నా నో ప్రాబ్లం… నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తాం..?

అద్దెకు ఉంటున్న ఇంటిని సొంత ఆస్తిగా చూపిస్తూ తప్పుడు సమాచారం ఇచ్చినా, ఇంటి పై ఆస్తిపన్ను బకాయిలు ఉన్న ఏమాత్రం పరిశీలించకుండా కళ్లు మూసుకుని ఎన్ఓసీ (NOC) జారీ చేయడం ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని బోనులో నిలబెడుతోంది.

అద్దె ఇంట్లో ఉన్నా, సొంతింటిపై బకాయిలున్నా  NOC లు జారీ ..?

అధికార పార్టీకి అధికారుల ‘అండ’దండలు నిజమేనా..!

నాకేం తెలియదు అంతా ఎస్ఐ కే తెలుసు అంటున్న కమీషనర్

హుజూర్ నగర్ మున్సిపల్ అధికారులకు ఏదైనా సాధ్యమే అంటున్న ప్రజలు..!

మీరు కిరాయి ఇండ్లలో ఉంటున్నారా….మీరు ఉంటున్న ఇంటికి మీకు నో అబెక్జన్ సర్టిఫికెట్ కావాలా..లేదా మీరుంటున్న ఇంటికి బకాయిలు చెల్లించకుండానే ఎన్వోసీ కావాలా వెంటనే హుజూర్ నగర్ మున్సిపాలిటీకి వచ్చి అధికారులకు అంతో ఇంతో ముట్ట జెప్పో, అధికార పార్టీ నాయకుడితో ఒక మాట చెప్పించుకునో ఎన్వోసీని పట్టుకెళ్లండంటున్నారు అధికారులు…?

వస్తున్న సామాన్య ప్రజలకు ఎన్ఓసి సర్టిఫికెట్ ఇవ్వడానికి చుక్కలు చూపే హుజూర్ నగర్ మున్సిపాలిటీ అధికారులు ఇల్లు తనది కాకుండా, ఇంటికి బకాయిలు ఉన్న ఇబ్బంది లేదు పర్మిషన్లను జారీ చేస్తాం దానికి అధికారం, అండదండలు ఉంటే చాలని నిరూపించే సంఘటన ఇదిగో..

తాజాగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమకు మున్సిపాలిటీలో ఎలాంటి బాకీలు లేవని ఎన్ఓసిని తమ డిక్లరేషన్ లో సమర్పించాల్సి ఉంటుంది.

దానికిగాను పోటీ చేసే అభ్యర్థులు మున్సిపాలిటీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను తీసుకొని వచ్చి ఎన్నికల అధికారులకు సమర్పిస్తారు.

ఈ సర్టిఫికెట్ను ఇవ్వాలంటే మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీలో వారికి ఎలాంటి బకాయిలు లేవు అని పరిశీలన చేసిన తర్వాతనే జారీ చేస్తారు. అయితే హుజూర్ నగర్‌ మున్సిపాలిటీలో తాజాగా వెలుగు చూసిన కౌన్సిలర్ల నామినేషన్ వ్యవహారం మున్సిపల్ అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

అద్దెకు ఉంటున్న ఇంటిని సొంత ఆస్తిగా చూపిస్తూ తప్పుడు సమాచారం ఇచ్చినా, ఇంటి పై ఆస్తిపన్ను బకాయిలు ఉన్న ఏమాత్రం పరిశీలించకుండా కళ్లు మూసుకుని ఎన్ఓసీ (NOC) జారీ చేయడం ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని బోనులో నిలబెడుతోంది.

ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి ఆస్తుల వివరాలు అత్యంత కీలకం. మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆస్తి పన్ను రికార్డులను సరిచూసిన తర్వాతే ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. కానీ, హుజూర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఫైళ్లు ఎలా కదులుతున్నాయో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

దీని వెనక ఉన్న ’హస్తం’ ఎవరిది..?

అసలు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది. అభ్యర్థికి తనది కాని అద్దె ఇంటికి సంబంధం ఏంటి అన్న కనీస వివరాలు చూడకుండానే అధికారులు సంతకాలు ఎలా చేశారు. అద్దె ఒప్పందం గానీ, యజమాని అనుమతి పత్రం గానీ లేకుండానే అధికారులు ప్రభుత్వ ముద్ర వేసి ధృవీకరించడం వెనుక ‘అదృశ్య హస్తం’ ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రాజకీయ ఒత్తిళ్లా..? విధి నిర్వహణలో వైఫల్యమా..?

సాధారణ పౌరుడు చిన్న పని కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే వేల ప్రశ్నలు వేసే అధికారులు, ఒక అభ్యర్థి తప్పుడు వివరాలు ఇస్తే ఎందుకు మౌనం వహించారు. ఇది కేవలం అధికారుల ‘నిద్రమత్తు’ మాత్రమేనా లేక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి చేసిన తప్పిదమా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యజమాని అనుమతి లేకుండా ఒకరి ఆస్తిని మరొకరి పేరుతో ధృవీకరించడం నేరపూరితమైన నిర్లక్ష్యం కిందకే వస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కళ్ళు మూసుకుని ఎన్ఓసీ జారీ చేసిన అధికారులను తక్షణమే విధుల్లోంచి తొలగించి, శాఖాపరమైన విచారణ జరపాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ ఎన్ఓసీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపకపోతే, ప్రజాస్వామ్య విలువలకు అర్థం లేకుండా పోతుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

నాకు ఏం తెలియదు… ఎస్సై కే తెలుసు..!

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ని వివరణ కోరగా మున్సిపల్ ఇన్‌స్పెక్టర్ జారీ చేసిన NOC సర్టిఫికెట్ ప్రస్తుతం మా పరిశీలనలో ఉంది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి సర్టిఫికేట్ ధ్రువీకరించినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేశారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button