వారణాసి గంగా ఘాట్లో దారుణం… మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన
పడవ ప్రయాణంలో ఉన్న ఇద్దరు మహిళలతో ఒక పూజారి అత్యంత అసభ్యంగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి గంగా ఘాట్ వద్ద ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పడవ ప్రయాణంలో ఉన్న ఇద్దరు మహిళలతో ఒక పూజారి అత్యంత అసభ్యంగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
గంగానదిలో కదులుతున్న పడవపై ఉన్న ఇద్దరు మహిళల బట్టలు లాగుతూ, వారిపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతున్నాయి.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వేగంగా వైరల్ అవుతుండగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు మరియు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.



