ఎస్సీ కార్పోరేషన్ సబ్సిడీ రుణాల గడువు పొడిగింపు
మార్చి 31 నుండి ఏప్రిల్ 08, 2026 తేది లోగా ధరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.

యస్సీ కార్పోరేషన్ ఈడి సిరాజుద్దీన్ అహ్మద్
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో మార్చ్ 30 (నిజం చెపుతాం)
యస్సీ కార్పోరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న యస్.స్సి కార్యావరణ ప్రణాళిక 2025-26 (సవరించబడినది) ద్వార సబ్సిడి రుణాలకు దరఖాస్తు చేసుకునే వారి కోసం గడువును మరోసారి పొడిగించారని ఆసక్తి గల యువతీ, యువరులు సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించగలరని జిల్లా కలెక్టర్ చైర్మన్ శ్రీ ఆదర్శ్ సురభి మరియు యస్పీ కార్పోరేషన్ ఈడి సిరాజుద్దీన్ అహ్మద్ ప్రకటనలో తెలియజేయడం జరిగింది.
మార్చి 31 నుండి ఏప్రిల్ 08, 2026 తేది లోగా ధరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.
ఈ సవరించబడిన కార్యాచరణ ప్రణాళిక ద్వారా మన వనపర్తి జిల్లాకు బ్యాంకు లోన్ తో కూడిన యూనిట్ రవాణా రంగానికి సంబధించి
ఈ వి టూ వీలర్ 84 యూనిట్లు 1లక్ష ఇందులో (సబ్సిడి 90% మరియు బ్యాంకు లోన్ 10%)ఈ వి త్రీ వీలర్ 41 యూనిట్లు, 3 లక్షలు (ఇందులో సబ్సిడీ 70% మరియు బ్యాంకు లోన్ 30% పశుపోషణ రంగానికి సంబంధించి పాడిపశువులు 45 యూనిట్లు 2.40 లక్షలు (ఇందులో సబ్సిడీ 70% బ్యాంకు లోన్ 30%) మంజూరు కావడం జరిగింది.ఏటువంటి బ్యాంకు లోన్ లేకుండా
ప్రతి వ్యవసాయ రంగానికి సంబంధించి సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ 9 యూనిట్లు 7 లక్షలు (ఇందులో సబ్సిడీ 100% 100 శాతం రాయితీ తో (వేజ్ ఎంప్లాయ్ మెంట్ 21 మందికి మరియు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ లో 17 మందికి ) నైపుణ్యశిక్షణ తరగతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
కావాల్సిన ధ్రువపత్రాలు
రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు,కుల ధృవపత్రం (తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్పి కుల వర్గీకరణ తరువాత జారిచేయబడినది).ఆదయ ధృవపత్రం (మీసేవ ద్వారా 01-ఏప్రిల్-2025 తరువాత జారిచేయబడినది),
రవాణా రంగ పథకాల కోసం శాశ్వత డ్రైవింగ్ టూ వీలర్, త్రీ వీలర్ లైసెన్స్ వ్యవసాయ పథకాల కొరకు పట్టదారు పాసుపుస్తకం మరియు రెండు ఎకరాల భూమి మరియు బోరు కలిగి అందులో నీటి వసతి గూర్చి గ్రామ పంచాయితి సెక్రటరీ ధ్రువీకరించిన పత్రం ఉండాలి)
వికలాంగులకు సదరం సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
అర్హత వయసు వ్యవసాయ పథకాల కొరకు 21 నుండి 60 ఏళ్ళు.వ్యవసాయేతర పథకాలకు 21 నుండి 50 ఏళ్ళు వేజ్ శిక్షణ కొరకు 18 నుండి 35 మరియు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ శిక్షణకు 18 నుండి 45 ఏళ్ళ వయస్సు.
ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల వారి ఆదాయం 1.5 లక్షలు,పట్టణ ప్రాంతం వారికీ 2.0 లక్షల ఆదాయం.అట్టి ధరఖాస్తు చేసుకున్న ప్రతి కి పైన తెలిపిన పత్రాలను జత చేసి సంబందిత మండల కార్యాలయం మున్సిపల్ కార్యాలయంలో 2 సెట్స్ సమర్పించగలరు.
రాజీవ్ యువ వికాసం ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా దీనికి ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులే అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలియజేయడం జరిగింది.



