IPL: ఆరంభ మ్యాచ్ RCB VS SRH కాదా.. ?…ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నా…?

బెంగుళూరు చిన్న స్వామి వేదికలో జరిగే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ లు తలపడటం లేదు  ఇండియా, పాకిస్తాన్ లు తలపడుతున్నాయంటూ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వగ్ ఈ వాఖ్యలు చేసాడంటూ ఫేక్ ఫోస్టులు క్రియేట్ చేస్తూ ఆరెంజ్ ఆర్మీపై సోషల్ మీడియా వేదికగా విద్వేషాన్ని వ్యాపింప చేస్తున్నారు. 

బెంగుళూరు చిన్న స్వామి వేదికలో జరిగే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ లు తలపడటం లేదు  ఇండియా, పాకిస్తాన్ లు తలపడుతున్నాయంటూ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వగ్ ఈ వాఖ్యలు చేసాడంటూ ఫేక్ ఫోస్టులు క్రియేట్ చేస్తూ ఆరెంజ్ ఆర్మీపై సోషల్ మీడియా వేదికగా విద్వేషాన్ని వ్యాపింప చేస్తున్నారు.

ది హండ్రెడ్ లీగ్ సన్ రైజర్స్ కోసం పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీనికి గాను సన్ రైజర్స్ కు వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు విద్వేషాన్ని వెల్లకక్కుతున్నారు. ఇది హైదరాబాద్ పై జరుగుతున్న దాడిగా కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇషాన్ కిషన్ కెప్టెన్ గా హైదరాబాద్ బెంగుళూరు జట్టుతో తలపడటానికి సిద్ధంగా ఉంది. పరుగుల వరదకు నిలయంగా ఉండే చిన్న స్వామి స్టేడియంలో ఎస్ఆర్ హెచ్ తన బలహీనమైన బౌలింగ్ తో  ఛాంపియన్ ఆర్సీబీని ఎలా నిలవరిస్తుందో చూడాలి.

రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గైర్హాజరీతో బౌలింగ్ మరింత బలహీనంగా కనిపిస్తుంది. ఉన్కదత్, హర్షల్ పటేల్ లతో కూడిన బౌలింగ్ విభాగం పటిష్టమైన బ్యాటింగ్ కలిగిన ఆర్సీబీని ఎలా నిలవరించగలుగుతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ఆర్సీబీ బౌలింగ్ కూడా బలహీనంగానే ఉండటం ఎస్ఆర్ హెచ్ కు కలిసొచ్చే అంశం అని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ హేజిల్ వుడ్, యశ్ దయాల్ లు జట్టులో చేరకపోవడంతో వీరి బౌలింగ్ కూడా బలహీనంగానే కనిపిస్తుంది. జాకబ్ డఫీ, మంగేష్ యాదవ్, రాసిఖ్ సలామ్ లు బౌలింగ్ లో రాణిస్తేనే ఆర్సీబీ విజయం సాధించగలుగుతుంది.

ఎస్ఆర్ హెచ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, ఇసాన్ కిషన్ లతో కూడిన బ్యాటింగ్ విభాగం అత్యంత బలంగా ఉంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button