కొబ్బరికాయ కొట్టే ఆచారం వెనుక అర్థం ఏమిటి ? హిందూ సంప్రదాయంలోని ప్రత్యేకత
హిందూ సంప్రదాయాలలో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. దేవాలయాల్లో, పూజల సమయంలో, కొత్త పనులు ప్రారంభించే వేళ కొబ్బరికాయ కొట్టడం సాధారణంగా కనిపించే ఆచారం. కానీ ఈ ఆచారం వెనుక ఉన్న అసలు అర్థం చాలా మందికి తెలియదు.

– ఆధ్యాత్మికత, శుభప్రారంభానికి సంకేతంగా నిలిచిన కొబ్బరికాయ ప్రాముఖ్యత
నాగారం, మార్చ్ 24.నిజం చెపుతాo
హిందూ సంప్రదాయాలలో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. దేవాలయాల్లో, పూజల సమయంలో, కొత్త పనులు ప్రారంభించే వేళ కొబ్బరికాయ కొట్టడం సాధారణంగా కనిపించే ఆచారం. కానీ ఈ ఆచారం వెనుక ఉన్న అసలు అర్థం చాలా మందికి తెలియదు.
పండితుల ప్రకారం, కొబ్బరికాయ మనిషి అహంకారానికి ప్రతీకగా భావిస్తారు. దానిని దేవుని ముందు కొట్టడం ద్వారా మనలోని అహంభావాన్ని విడిచిపెట్టి, వినయంతో ముందుకు సాగాలని సూచిస్తుంది.
కొబ్బరికాయలోని తెల్లని గుజ్జు పవిత్రతకు సంకేతం కాగా, దానిలోని నీరు శుద్ధతను సూచిస్తుంది.అలాగే, ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు కొబ్బరికాయ కొట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇది చెడు శక్తులను దూరం చేసి, మంచి ఫలితాలు కలగాలని సంకేతంగా చేస్తారు.
పురాణాలలో కూడా కొబ్బరికాయను శ్రీఫలం గా పేర్కొంటారు, అంటే దేవునికి అత్యంత ఇష్టమైన ఫలంగా భావిస్తారు.ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. పూజా కార్యక్రమాల్లో కొబ్బరికాయ కొట్టడం ద్వారా భక్తులు తమ భక్తిని వ్యక్తపరుస్తూ, శుభం కోరుకుంటున్నారు.
సాంప్రదాయంలో భాగంగా ఉన్న కొబ్బరికాయ కొట్టే ఆచారం కేవలం అలవాటే కాదు, దానిలో లోతైన ఆధ్యాత్మిక భావం దాగి ఉందని పండితులు చెబుతున్నారు.



