ఇంటర్నేషనల్ పారా ఒలంపిక్ విజేతకు గ్రూప్ 2 ఉద్యోగం..అసెంబ్లీలో ఆమోదం
పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి దేశానికి గర్వకారణమని బిల్లును అసెంబ్లీ లో పెట్టడం హర్షనియమని,2024 లో పారా ఒలంపిక్ క్రీడలలో 400 మీటర్ల టి 20 విభాగంలో 55.06 సెకన్లలో పారా ఒలంపిక్ లో మొదటిసారి దేశానికి కాంస్య పతకం సాధించిందని ఆమె జీవితమే మనకు ఆదర్శం అని, "కృషి తో నాస్తి దుర్భిక్షం" అనే వేధ సూక్తికి దీప్తి జీవాంజీ నిదర్శనం అని సిర్పూర్ బిజెపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు.

జీవంజి దీప్తికి గ్రూపు-2 ఉద్యోగం అసెంబ్లీలో ఆమోదం
పర్వతగిరి: నిజం న్యూస్ మార్చ్23
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఇంటర్నేషనల్ పారా ఒలంపిక్ విజేత జీవాంజి దీప్తి కీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 2 ఉద్యోగం ఎట్టకేలకు అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో పర్వతగిరి మండల వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో గ్రూప్ 2 ఉద్యోగం ఆమోదం తెలపడంతో ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరాలు ఉంటే తెలుపమని అసెంబ్లీలో అడగడంతో ఎలాంటి అభ్యంతరాలు లేవని జీవంజి దీప్తి నిరుపేద, దినసరి కూలీ పనులు చేసే కుటుంబం నుండి వచ్చిందని
పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి దేశానికి గర్వకారణమని బిల్లును అసెంబ్లీ లో పెట్టడం హర్షనియమని, 2024 లో పారా ఒలంపిక్ క్రీడలలో 400 మీటర్ల టి 20 విభాగంలో 55.06 సెకన్లలో పారా ఒలంపిక్ లో మొదటిసారి దేశానికి కాంస్య పతకం సాధించిందని ఆమె జీవితమే మనకు ఆదర్శం అని, “కృషి తో నాస్తి దుర్భిక్షం” అనే వేధ సూక్తికి దీప్తి జీవాంజీ నిదర్శనం అని సిర్పూర్ బిజెపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు.
తదుపరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిల్లుకు ఆమోదం తెలపడంతో అసెంబ్లీ స్పికర్ గడ్డం ప్రసాద్ బిల్లును పాస్ చేశారు.



