అక్రమ కజ్జాపై హైకోర్టు కొరడా …ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో భూమి స్వాధీనం

పూర్తి హక్కు కలిగి ఉన్నప్పటికీ అక్రమంగా కబ్జా చేసుకుని కొనసాగుతున్న వ్యక్తి అక్రమ కబ్జాపై గరుడ కురిపిస్తూ హక్కుదారునికి, పోలీస్ ప్రొటెక్షన్ తో భూమిని అప్పగించడం తో న్యాయవ్యవస్థ మరియు పోలీస్ వ్యవస్థ పై ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంచేలా చేసింది.

పోలీస్ ప్రొటెక్షన్ తో హక్కుదారునికి భూమి అప్పగింత.

మహదేవపూర్ భూపాలపల్లి మార్చి 23 (నిజం న్యూస్)

పూర్తి హక్కు కలిగి ఉన్నప్పటికీ అక్రమంగా కబ్జా చేసుకుని కొనసాగుతున్న వ్యక్తి అక్రమ కబ్జాపై గరుడ కురిపిస్తూ హక్కుదారునికి, పోలీస్ ప్రొటెక్షన్ తో భూమిని అప్పగించడం తో న్యాయవ్యవస్థ మరియు పోలీస్ వ్యవస్థ పై ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంచేలా చేసింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల మండలంలోని బొమ్మపూర్ శివారులో, సర్వే నెంబర్ 98/బి.4ఎకరాల రెండ్ గుంటల వ్యవసాయ భూమి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, హక్కుదారుడు కంకణాల అరుణ భర్త రవీందర్ కు పోలీస్ ప్రొటెక్షన్ తో భూమిని అప్పగించడం జరిగింది.

 

*ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో భూమి స్వాధీనం.*

 

సోమవారం రోజు ఉన్నత న్యాయస్థానం బదితుని రైట్ పిటిషన్ రెండు 21599,2019, పరిగణంలోకి తీసుకొని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226, అనుగుణంగా మంథని సివిల్ కోర్ట్ న్యాయస్థానం, జడ్జిమెంట్ డిగ్రీ, ఓ ఎస్ నంబర్ 52 /2012 ను పరిగణంలోకి తీసుకుంటూ, సర్వహక్కులు కలిగిన కంకణాల అరుణ, కు చెందిన సర్వేనెంబర్ 98/b

లోని నాలుగు ఎకరాల రెండు గంటల వ్యవసాయ భూమిని,వారికి అప్పగించుటకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో పూర్తి హక్కుదారుడైన కంకణాల అరుణ రవీందర్ కు ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ సమక్షంలో మొఖాపై పోలీస్ ప్రొటెక్షన్ తో వేళ్ళు,నాలుగు ఎకరాల రెండు గుంటల వ్యవసాయ భూమిని అప్పగించడం జరిగింది.

 

*పోలీస్ ప్రొటెక్షన్ తో హక్కుదారునికి భూమి అప్పగింత*

 

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో మహాదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, బొమ్మ పూర్ శివారులోని సర్వే నెంబర్ 98/బి లో నాలుగు ఎకరాల రెండు గుంటల వ్యవసాయ భూమి, పూర్తి హక్కుదారుడైన కంకణాల అరుణ రవీందర్ కు, వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి అక్రమంగా కబ్జా చేసి ఉన్న వారి నుండి, హక్కుదారుడైన కంకణాల అరుణ రవీందర్ కు, అప్పగించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల అనుసారం, హక్కుదారునికి భూమి అప్పగించే కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తో పాటు, సివిల్ కానిస్టేబుల్ మరియు ఏఆర్ కానిస్టేబుల్ లతోపాటు మహిళా కానిస్టేబుల్ ఉన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button