హామీలు ఏవి..? అసెంబ్లీలో కేటీఆర్ ఘాటు విమర్శలు..!
గవర్నర్ ప్రసంగం తన విలువను కోల్పోయిందని ఎద్దేవా

రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ వేదికగా విరుచుకుపడ్డారు.
రెండున్నర ఏళ్లు గడిచినా ‘ఆరు గ్యారెంటీలు’ అమలుకు నోచుకోలేదని, అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు.
భవిష్యత్తుకు దిక్సూచిగా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం తన విలువను కోల్పోయిందని ఎద్దేవా చేశారు.
రైతు భరోసా, మహిళలకు ఆర్థిక సాయం, పెన్షన్ల పెంపు వంటి హామీలు అందక సామాన్య కుటుంబాలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం మాటలు కట్టిపెట్టి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.



