రెవిన్యూ డివిజన్ లో ఈ షాడో ‘వీరుడి’దే హవా..!

అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం వేల కోట్లను ఖర్చు పెట్టి రైతులను ఒప్పించి భూసేకరణ జరుపుతుంటే, మరోపక్క ఆ భూములపై ఈ అధికార పార్టీ నాయకుడు పెత్తనం చెలాయిస్తూ అధికారులను శాసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం మొత్తాన్ని తన గుప్పెట్లో ఉంచుకొని కార్యాలయంలో ఉన్నతాధికారులకు నీడలా ఉంటూ సర్వే నెంబర్ 1041 లో చక్రం తిప్పుతున్నాడనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఆర్డిఓ కార్యాలయం వేదికగా రైతులపై దాడులు జరుగుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి.

ఆర్డీవో కార్యాలయంలో తిష్టవేసిన హస్తం పార్టీ ‘లీడర్’..?

24 గంటలు ఆర్డీవో కార్యాలయంలోనే ..?

సర్వేనెంబర్ 1041 భూసేకరణలో చేతి వాటం..?

3 కోట్ల వరకు చేతులు మార్చినట్లు ఆరోపణలు…?

సెటిల్మెంట్లలో వాటాలు పంచేది ఇతనేనా.?

మంత్రి నియోజకవర్గంలో అక్రమాలకు తెర..!

హుజూర్ నగర్ నియోజకవర్గ రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఒక షాడో రాజ్యమేలుతున్నాడన్న పుకార్లు బలంగా వినపడుతున్నాయి. అధికారిక సమావేశాల్లో, రైతులతో జరిగే సమావేశాల్లో అధికారుల ప్రక్కనే ఉంటూ అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తూ వారికి అండదండగా ఉంటున్నాడని తెలుస్తోంది.

అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం వేల కోట్లను ఖర్చు పెట్టి రైతులను ఒప్పించి భూసేకరణ జరుపుతుంటే, మరోపక్క ఆ భూములపై ఈ అధికార పార్టీ నాయకుడు పెత్తనం చెలాయిస్తూ అధికారులను శాసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం మొత్తాన్ని తన గుప్పెట్లో ఉంచుకొని కార్యాలయంలో ఉన్నతాధికారులకు నీడలా ఉంటూ సర్వే నెంబర్ 1041 లో చక్రం తిప్పుతున్నాడనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఆర్డిఓ కార్యాలయం వేదికగా రైతులపై దాడులు జరుగుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి.

వాటాలు పంచుతున్న షాడో..?

అధికారుల కళ్ల ముందే అక్రమాలు జరుగుతున్నా వారు మౌనంగా ఉండటం వెనుక రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు అందుతున్నాయని, ప్రతి రికార్డు మార్పిడికి, రికార్డుల్లో అనర్హుడి పేరు ఎక్కించడానికి ముందస్తుగా ‘రేటు’ ఖరారవుతోందని తెలుస్తోంది. అధికారుల కన్ను సన్నల్లోనే ప్రతిదీ ఆ షాడో నిర్వహించి వాటలు పంచుతున్నాడన్న భాధిత రైతులు తెలుపుతున్నారు.

మట్టి నుంచి చెట్టు వరకు.. అన్నీ ఆయనే..!

నియోజకవర్గంలో జరుగుతున్న మట్టి, ఇసుక దందాల నుంచి మొదలుకొని, ప్రభుత్వ భూముల సెటిల్మెంట్ల వరకు అన్నింటిలోనూ సదరు ‘షాడో వీరుడి’ ప్రమేయం ఉంటున్నట్లు సమాచారం. అధికారులకు ముడుపులు అందజేయడంలో మధ్యవర్తిగా ఉంటూ, రెవిన్యూ రికార్డులను సైతం మార్పించగల స్థాయికి ఇతని ఆగడాలు చేరాయని అధికారులకు ఇతను చెప్పిందే వేదమని, 1041 సర్వే నెంబర్ లో ఏమైనా సమస్యలు ఉంటే సదరు వ్యక్తిని కలవాలని అధికారులు బహిరంగంగానే చెప్తున్నారని పలువురు రైతులు తెలుపుతున్నారు.

1041లోనే అసలు దందా..!

హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని ఎర్రగట్టు వద్ద సర్వే నెంబర్ 1041 లో 278 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని చాలామంది రైతులు సేద్యం చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు. ఈ సర్వే నెంబర్ లో ఎర్రగట్టు గ్రామం, రోడ్లు, దేవాలయాలు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఈ సర్వే నెంబర్ నుండి 100 ఎకరాలను తీసుకొని రైతులకు ఎకరానికి 24 లక్షలను చెల్లించారు. పంట నష్టానికి గాను ఎకరానికి రూ. 50 వేలను చెల్లించారు.

 

సర్వే సమయంలోనే చేతి వాటం

అయితే ఈ 100 ఎకరాల భూమిని సర్వే చేసే సమయంలో రైతుల భూమిని 4 కుంట నుంచి 5 కుంటలు తక్కువగా చూపించి వాటికి సంబంధించిన రికార్డులను సరిచేసి తమ వారి పేర్లను ఎక్కించినట్లు తెలుస్తోంది. అంతేగాక భూమిలో ఉన్న పంట కాలువలు, యేనేలు, కాలి బాటలను, బావులను కూడా వ్యవసాయ భూములుగా లెక్కకట్టి వాటి డబ్బులను రైతులకు క్రింద జమ చేయకుండా తమకు సంబంధించిన బినామీ పేర్లను ఎక్కించి వారి ఖాతాలో సుమారు రూ. 3 కోట్లను వేసి పంచుకున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి.

 

కమీషన్లు మాట్లాడటం…రికార్డుల్లో పేర్లను మార్చడం…

సర్వేలు చేయడం…కమీషన్లు మాట్లాడటం ఇతని వంతే… బాధితుల ఫిర్యాదు ప్రకారం, రైతులు లేని సమయంలో పొలాల్లోకి వెళ్లి సర్వేలు చేయడం, కమిషన్లు మాట్లాడి రికార్డుల్లో పేర్లు మార్చడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. ఇపుడు వ్యవసాయ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వం ‘ఫుడ్ కోర్టు’ (ఫుడ్ పార్క్) నిర్మాణానికి కూడా భూసేకరణ చేపట్టింది. దీనికి గాను ఇదే సర్వే నంబర్ లో మిగిలిన 138 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ లో కూడా చాలామంది అనర్హులను చేర్చి ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు మాకింత మీకింత అని అధికారులు, షాడో వాటాలు వేసుకుని తమ పనిని ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ సేకరణలో డబ్బులు చెల్లించే సమయంలో అధికారులు ఈ షాడోను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఉన్నతాధికారుల మౌనం.. మంత్రికి తెలిస్తే ఊరుకుంటాడా..?

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగులు, కొందరు దళారులతో చేతులు కలిపి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మౌనంగా ఉండటం వెనుక కారణాలేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, సర్వే నంబర్ 1041లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి, అసలైన రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు, అక్రమార్కులకు సహకరిస్తున్నట్లుగా మంత్రి ఉత్తమ్ కు తెలిస్తే అధికారులకు పరిస్థితి ఏమిటనేది వేచి చూడాలి.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button