వరి కొనుగోలు వ్యవహారం ఒక భారీ స్కాం.!?

వరి కొనుగోలు వ్యవహారం ఒక భారీ స్కాం.!?

బడా అధికారుల ప్రోత్సాహంతోనే అంతా గోల్మాల్.!?

రైస్ మిల్, కాంట్రాక్టర్ కొనుగోలు కేంద్రాల నుండి భారీ ముడుపులు.!?

‎బడా అధికారుల అండతో, ఇప్పటికీ కోత, ట్రాన్స్పోర్ట్ బిల్లు వ్యవహారం పై నిశ్శబ్దం.?

ఆదేశాలను పాటించని అధికారులు, రెట్టింపు ఉత్సాహంతో ధాన్యం కోత..!?

‎కోత, ట్రాన్స్పోర్ట్ పేరుతో కోట్ల రూపాయలు త్రిమూర్తులు బడా అధికారుల జేబుల్లో కి.!?

వరి కొనుగోలు స్కాంపై సి ఎస్ విచారణ చేపట్టాలి, ప్రజలు.

‎మహాదేవపూర్, భూపాలపల్లి; జూన్ 9 (నిజం న్యూస్)

యాసంగి వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం గత కొన్ని ఏళ్లుగా భారీ స్కాం కు రూపుదిద్దుకొని, కోట్ల రూపాయలు బడా అధికారులతో పాటు, రైస్ మిల్ నిర్వాహకులు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, కల్లాల నిర్వాహకులు సొమ్ము చేసుకోవడం జరుగుతుందని, వరి ధాన్యం కోత పేరుతో లక్షల కిలోల టన్నుల ధాన్యం కోత విధించడం, సమయానికి రవాణా చేయకుండా, ధాన్యం కల్లాల వద్ద ఎండ వానకు తడవడం, ధాన్యం స్థితిలో మార్పు వచ్చే విధంగా రవాణా చేయకుండా కల్లాల వద్ది ఉంచడం, ధాన్యం ట్రాన్స్పోర్ట్ పై ఎవరు స్పందించకపోవడం, రైతులు సొంత డబ్బులతో లేదా కొద్ది సమయానికి కాంట్రాక్టర్ ద్వారా రైస్ మిల్లుకు చేరిన ధాన్యం, రెండున్నర నుండి మూడున్నర కిలోల వరకు, ధాన్యం సరిగ్గా లేదని కోత విధించడం, ఇదంతా ఆ త్రిమూర్తులతో పాటు బడా అధికారుల కను సైగల్లో జరిగే వ్యవహారం, యాసంగి ధాన్యం కొనుగోలు వ్యవహారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి మే చివరి వరకు కొనసాగే కొనుగోలు రవాణా ప్రక్రియ, దీని వెనుక అసలు దాగి ఉన్న స్కాం అంతా ఇంత కాదు, లక్షల రూపాయల సొమ్ము బడా అధికారులకీ అందించి, రైతుల ఎన్ని గోసలు ధర్నాలు, రాస్తారోకులు, పత్రికా మరియు టీవీ లో వార్తలు వరుస కథనాలు వచ్చిన, అధికారుల్లో చలనం ఉండదు. ప్రభుత్వం ధాన్యం రవాణాలో జాప్యం నిర్లక్ష్యం, పై కఠిన చర్యలకు ఆదేశించిన, భారీ మొత్తంలో బడా అధికారులు త్రిమూర్తులతో కుమ్మక్కైన విషయం ప్రభుత్వానికి తెలవకపోవడం, సమయానికి ధాన్యం రవాణా చేయకుండా రవాణా చేసిన ధాన్యాన్ని, గింజలు నల్లబడ్డాయని, ధాన్యం తడిసిందని, పలు కారణాలతో ప్రతి లారీ కు సుమారు 100 బస్తాలకు పైచిలుకు ధాన్యం, కోత విధించడం దర్జాగా కొనసాగుతుంటే, అధికారులు మాత్రం వీటిపై చర్యలు తీసుకోకుండా, ధాన్యం రవాణాలు జాప్యం ఉండకూడదని, పలుచోట్ల పరిశీలనలు చేస్తూ అక్రమాలను తప్పుదారి పట్టించి రైస్ మిల్ మరియు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ను కాపాడడంలో నిమగ్నం కావడం జరిగింది. ఎట్టకేలకు సబ్ డివిజన్ పరిధిలో ధాన్యం రవాణా 50 శాతం కన్నా ఎక్కువగా రైతులే సొంత ఖర్చుతో రవాణా చేసుకున్నారు, సబ్ డివిజన్ పరిధిలోని సుమారు 46 కొనుగోలు కేంద్రాల నుండి, రైస్ మిల్లుకు తరలివెళ్లిన ధాన్యం లో 8 నుండి 12 శాతం ధాన్యం కోత పేరుతో సొమ్ము చేసుకోవడం జరిగింది. ఈ ధాన్యం కొనుగోలు స్కాం అంతా బడా అధికారుల కను సైగల్లో జరుగుతుందని చెబుతున్నారు రైతులు మరియు ఉమ్మడి మండల ప్రజలు.

‎బడా అధికారుల ప్రోత్సాహంతోనే అంతా గోల్మాల్.!?

సబ్ డివిజన్ పరిధిలో ప్రతి సంవత్సరం నిర్వహించబడే యాసంగి వడ్ల కొనుగోలు వ్యవహారం కొనుగోలు కేంద్రాల నుండి మొదలుకొని, వయా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తో పాటు రైస్ మిల్లు వరకు, కల్లం నుండి రైస్ మిల్లుకు చేరేవరకు, జరిగే అక్రమాలు అన్ని బడా అధికారుల ప్రోత్సాహంతోనే “వరి కొనుగోలు రవాణా స్కాం”కు పునాది పడి గత కొన్ని సంవత్సరాలుగా, కోత కమిషన్ పేరుతో కోట్ల రూపాయలు అమాయక రైతుల ధాన్యం నుండి సొమ్ము చేసుకోవడం జరుగుతుందని, ఈస్కాన్ వ్యవహారమంతా బడా అధికారుల కను సైగల్లో జరుగుతుంది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నా అంటున్నారు ప్రజలు. రైస్ మిల్ నిర్వాహకులతో పాటు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అలాగే కల్లాల బాధ్యత నిర్వహించి వారి నుండి బడా అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందించడం జరుగుతుందని, అందుకే అధికారులు కేవలం మాటలకి తప్ప చేతలు చర్యలకు, ప్రత్యేకంగా రైస్ మిల్ కోత విషయం, సమయానికి ధాన్యం రవాణా చేయకపోవడంపై ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పై చర్యలు లాంటి వాటిని కూడా అధికారులు తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరించడం జరుగుతుంది, అనడానికి ప్రస్తుత యాసంగి ధాన్యం లో ఇబ్బందులే సాక్ష్యం తో పాటు ఇప్పటికీ రైతులకు పెద్ద మొత్తంలో కోత విధించి, వారి ఖాతాల్లో డబ్బులు వేయడం ఒక ప్రధాన సాక్ష్యం. మరోవైపు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కల్లాల నుండి 50% వరకు ధాన్యం రవాణా రైతులు సొంత ఖర్చు పెట్టుకొని రవాణా చేసుకుంటే, వాటికి సంబంధించిన కమిషన్ మరియు లారీ కిరాయి ఇప్పటికీ రైతులకు రాకుండా ఎవరి ఖాతాలోకి వెళ్ళింది అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని చెప్పడానికి ఇదే మరో బలమైన సాక్ష్యం అని చెబుతున్నారు బాదిత రైతులు.

‎ఆదేశాలను పాటించని అధికారులు, రెట్టింపు ఉత్సాహంతో ధాన్యం కోత..!?

యాసంగి వరి ధాన్యం కొనుగోలు రవాణా పై రైతులకు ఏలాంటి నష్టం వాటిల్ల పోవద్దని, రైతులు ఆరు కాలం పండించిన పంటకు కోత పేరుతో రైతులకు ఇబ్బందులకు గురి చేస్తే, రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకుంటామని, అంతేకాదు రవాణా విషయంలో, సాధ్యమైనంత త్వరగా కల్లాల నుండి ధాన్యం రైస్ మిల్లులకు చేరాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ మంత్రి ఉప ముఖ్యమంత్రి, పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా జిల్లా కలెక్టర్లకు సూచించారు. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మహదేవపూర్ సబ్ డివిజన్ పరిధిలో, బడా అధికారులు, ప్రభుత్వ ఆదేశాలను డోంట్ కేర్ అన్నారు. అధికారుల నిర్లక్ష్యం రైస్ మిల్లు రెట్టింపు ఉత్సాహంతో రెండు కిలోల నుండి మూడున్నర కిలోల వరకు, రైతుల ధాన్యం కోత విధించింది, కానీ 60 రోజుల ప్రక్రియలో అధికారులు రైస్ మిల్లు పై చర్యలు తీసుకోకపోవడం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో, అంతేకాదు ధాన్యం కల్లాల నుండి రవాణా ప్రధాన సమస్య, లారీలు లేనటువంటి కాంట్రాక్టర్ రవాణా కొరకు టెండర్ ఎలా దక్కించుకున్నాడు, ఎవరి అండతో లారీలే లేనప్పటికీ బూచిగా ఆర్సి పత్రాలు చూపెడితే టెండర్ అప్ప చెప్పింది ఎవరు, ఇదిలా ఉంటే ఇక రవాణా విషయంలో, సుమారు 55 రోజులపాటు రైతు గోస దేవునికి ముట్టింది, అయినా అధికారులు నిశ్శబ్దాన్ని వ్యవహరించి, రైతులే ధాన్యం రవాణా చేస్తుంటే సంబరపడి సినిమాల చూశారు బడా అధికారులు, ఎందుకో మరి. ఒకవైపు కోత మరోవైపు ట్రాన్స్పోర్ట్ చేయకుండా జాప్యం, కొనుగోలు కేంద్రాల వద్ద, నిర్వహకుల అరాచకం, ధాన్యం చెడిపోయే దుస్థితికి దారితీసి, పెద్ద మొత్తంలో కోత విధించి సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా బడా అధికారుల అనుసైగల్లో, లక్షల రూపాయలు అధికారులకు ముట్ట జెప్పి కోట్ల రూపాలు సొమ్ము చేసుకున్న త్రిమూర్తుల వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఇదే. కానీ చర్యలు తీసుకోకపోవడంతో, నేటి వరకు రైస్ మిల్లుల నుండి, భారీ కోతతో, రైతుల ఖాతాల్లోకి, లక్షల రూపాయలు కట్ చేసి, జమ చేయడం జరుగుతుంది. గత కొన్ని ఏళ్లుగా రైస్ మిల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కల్లాల నిర్వాహకులు, బడా అధికారులతో కుమ్మక్కై, యాసంగి వరి కొనుగోలు ఒక భారీ స్కామ్ గా రూపు దిద్దుకుంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రత్యేక అధికారిని నియమించి, రైస్ మిల్ కోత వ్యవహారం, రైతులు రవాణా చేసుకున్న ట్రాన్స్పోర్ట్ చార్జీలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక చొరవతో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రైతులు మరియు ప్రజలు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button