జనన ధృవీకరణ పత్రాల ఆలస్య నమోదుకు లంచం అడిగిన ఆర్డీవో
జనన ధృవీకరణ పత్రాల ఆలస్య నమోదుకు ఆర్డీవో లంచం డిమాండ్ చేయగా ఫిర్యాదు దారులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు మంగళవారం సదరు ఆర్డీవోను రెడ్ హ్యండెడ్ పట్టుకున్నారు.

జనన ధృవీకరణ పత్రాల ఆలస్య నమోదుకు ఆర్డీవో లంచం డిమాండ్ చేయగా ఫిర్యాదు దారులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు మంగళవారం సదరు ఆర్డీవోను రెడ్ హ్యండెడ్ పట్టుకున్నారు. వివరాల్లోనికి వెళితే
నారాయణపేట రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) పాత్లావత్ రామచందర్, ఫిర్యాదుదారుడు, అతని నలుగురు స్నేహితుల జనన ధృవీకరణ పత్రాల ఆలస్య నమోదుకు సంబంధించిన ఫైలును ఆమోదించేందుకు గాను
రూ. 25,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం ఆయన వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.



