పోలీస్ కట్టడి, ముట్టడి లో భాగంగా తనిఖీ
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీసు సేవలు అందిస్తున్నామని తెలిపారు. అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలు అనుమానిత వ్యక్తుల కదలికుల నిర్మూలన లక్ష్యంగా కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అన్నారు.

*పటిష్టంగా వాహనాల తనిఖీలు*
*అక్రమ రవాణా నిరోధం కోసం పోలీసు చర్యలు*
*పోలీస్ అంటే దైర్యం, ప్రజలకు అండగా సేవలు*
గరిడేపల్లి మే 27 (నిజం చెపుతాం)
ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా భద్రత కల్పించడం లక్ష్యంగా, బక్రీద్ పండుగ సందర్బంగా గోవులు, పశువుల అక్రమ రవాణా నిరోధం లో భాగంగా ఎస్పి నరసింహ ఆదేశాల మేరకు బుధవారం రోజు గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పొనుగోడు అడ్డ రోడ్డు వద్ద పోలీసు కట్టడి ముట్టడి, నాకాబంది కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మరియు సర్కిల్ పరిధిల మండలలో కూడా కట్టడి ముట్టడి నిర్వహించినట్లు హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు తెలిపారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీసు సేవలు అందిస్తున్నామని తెలిపారు. అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలు అనుమానిత వ్యక్తుల కదలికుల నిర్మూలన లక్ష్యంగా కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అన్నారు.
ఈ తనిఖీల్లో భాగంగ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాం, పశువులు, గోవుల అక్రమ రవాణా పై నిఘా ఉంచాం, పేలుడు సామాగ్రి, మారణాయుధాలు తరలింపు ఏమైనా జరుగుతుందా అని పరిశీలించడం జరిగినది. తనిఖీలో భాగంగా త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, విత్ ఔట్ హెల్మెంట్, విత్ ఔట్ లైసెన్స్, సీట్ బెల్ట్ ధరించని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. మరియు గంజాయి లాంటివి ఏమైనా తరలిస్తున్నారా అనేది పరిశీలిండం జరిగినది. గంజాయి రవాణా చేసిన వ్యక్తులు మళ్లీ సంచరిస్తున్నారా అనేది నిఘా పెట్టాం. గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించవద్దు అని సీఐ వాహనదారులకు సుచించడం జరిగింది. ఇట్టి కట్టడి, ముట్టడి కార్యక్రమంలో గరిడేపల్లి ఎస్ఐ బి శ్రీకాంత్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.



