బిల్లు ల కొరకు ఒక్కరోజు ఫ్రీ లారీలు.*

రైతులు  పంపిన లారీల కొరకు కాంట్రాక్టర్ కొత్త డ్రామా.* *2వేళా లారీల కమిషన్ ఎవరి ఖాతాలో, రైతులకు వచ్చేనా.* ‎ *భారీ దోపిడీకి శ్రీకారం, వర్షం పేరుతో నాలుగు కిలోల కోత.* *అధికారులు మా చేతిలో ఉన్నారు డోంట్ కేర్.* ‎ *రైతులకు న్యాయం కాంట్రాక్టర్, రైస్ మిల్లు పై చర్యలు తీసుకునే వరకు అక్షర పోరాటం.

*బిల్లు ల కొరకు ఒక్కరోజు ఫ్రీ లారీలు.*

*రైతులు  పంపిన లారీల కొరకు కాంట్రాక్టర్ కొత్త డ్రామా.*

*2వేళా లారీల కమిషన్ ఎవరి ఖాతాలో, రైతులకు వచ్చేనా.*

‎ *భారీ దోపిడీకి శ్రీకారం, వర్షం పేరుతో నాలుగు కిలోల కోత.*

*అధికారులు మా చేతిలో ఉన్నారు డోంట్ కేర్.*

‎ *రైతులకు న్యాయం కాంట్రాక్టర్, రైస్ మిల్లు పై చర్యలు తీసుకునే వరకు అక్షర పోరాటం.*

‎ *మహాదేవపూర్ భూపాలపల్లి, జూన్ 2 (నిజం న్యూస్)*

‎ధాన్యం కొనుగోలు రవాణా కమిషన్ అక్రమాలకు కెరాఫ్ గా మారి అమాయక రైతుల నుండి, లక్షల రూపాయలు ట్రాన్స్పోర్ట్ పేరుతో, ధాన్యం కోత పేరుతో లక్షల కిలోల ధాన్యాన్ని  సొమ్ము చేసుకుని, వర్షం పేరుతో ధాన్యం నల్లబడడం జరిగిందంటూ, బస్తాకు నాలుగు కిలోల ధాన్యాన్ని గత మూడు రోజులుగా కోత విధిస్తూ, ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా, ఇటు కాంట్రాక్టర్ అటు రైస్ అన్నపూర్ణ రైస్ మిల్, ఏదేచ్ఛగా లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న క్రమంలో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం చివరి దశకు రావడం, కొన్ని కేంద్రాల్లో నాలుగు నుండి ఆరు లారీల ధాన్యం నిలువ ఉండడంతో, కొత్త నాటకాన్ని ప్రారంభించిన కాంట్రాక్టర్, తాజాగా రెండు రోజుల నుండి బస్టాకు పైసలు వసూలు లేదంటూ, కొనుగోలు కేంద్రాల వద్ద రెండు నుండి మూడు లారీలను పంపడం ప్రారంభించి, గతంలో పెద్ద సంఖ్యలో రైతులు సొంత డబ్బులతో ధాన్యాన్ని రవాణా చేసిన, కమిషన్ను తన ఖాతాలో వేసుకునుటకు కాంట్రాక్టర్ లారీలు పంపి కొత్త డ్రామా సృష్టించి కమిషన్ తన వైపు మళ్లించుకొనుటకు లారీలను రవాణా చేయడం స్పష్టంగా కనబడుతుంది.

 

‎ *రైతులు  పంపిన లారీల కమిషన్, కొరకు కాంట్రాక్టర్ కొత్త డ్రామా.*

 

‎ధాన్యం కొనుగోలు ప్రక్రియ లో త్రిమూర్తుల కమిషన్ కక్కుర్తికి, సబ్ డివిజన్ పరిధిలోని వేల రైతులు, లక్షల కింటల్ ల ధాన్యాన్ని కోత పేరుతో కోల్పోవడం జరుగుతుంది. మరోవైపు త్రిమూర్తుల్లోని ప్రధాన సూత్రధారి, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, ధాన్యం రవాణా చేయకుండా, రైతుల లే  15 నుండి 20 రూపాయలు, వెచ్చించి సుమారు, 1500 లారీల వరకు సబ్ డివిజన్ పరిధిలో స్వయంగా ధాన్యాన్ని మిల్లుకు పంపుకోవడం జరిగింది, కాంట్రాక్టర్ కమిషన్ భాగవతం రవాణా చేయకపోవడం వెనుక కారణం, లారీలు లేకున్నా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అధికారులు అప్పజెప్పడం, తెర వెనుక వాస్తవాలు గత 16 రోజులుగా ప్రజల ముందుకు రావడం జరిగింది. ఇక తాను ధాన్యం రవాణా కొరకు సమయానికి లారీలు అందుబాటులో తీసుకు రాలేదన్న విషయం, తెలుసుకున్న కాంట్రాక్టర్, భారీ లారీల కమిషన్ చేజారి పోతుందని ఒక కొత్త డ్రామాకు సృష్టించి, సబ్ డివిజన్ పరిధిలో కొన్ని కల్లాల వద్ద మిగిలి ఉన్న ధాన్యాన్ని, రవాణా కొరకు రోజుకు ఒకటి లేదా రెండు, లారీలను రవాణా చేసి, కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు, కాంట్రాక్టర్ లారీలు వస్తున్నాయని, రైతులను పక్కదారి పట్టించి, రైతులు సొంత ఖర్చుతో లారీలు రవాణా చేసిన డబ్బులు ఆశించకుండా, మళ్లించుటకు కాంట్రాక్టర్ లారీల రవాణా, కొనుగోలు కేంద్రాల వద్ద ప్రచారం చేయడం విశేషం.

*2వేళా లారీల కమిషన్ ఎవరి ఖాతాలో, రైతులకు వచ్చేనా.*

‎మహాదేవపూర్ కాటారం సబ్ డివిజన్ పరిధిలో, పిఎసిఎస్ డిసిఎంఎస్, ఆధ్వర్యంలో నిర్వహించబడిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు అందించిన వెల టన్నుల ధాన్యం, రవాణా కొరకు ట్రాస్పోర్ట్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ, కాంట్రాక్టర్ వద్ద లారీలు లేకపోవడం, బయటి నుండి తక్కువ ధరకు లారీల రవాణా కొరకు ప్రయత్నం విఫలం కావడం, మే నెలలో పెద్ద మొత్తంలో భానుడి ప్రతాపం, వేల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రవాణాకు నోచుకోకపోవడం, అదే నెలలో కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైఫల్యం తో వాతావరణంలో మార్పు, రవాణా కాకుండా ఉన్న ధాన్యాన్ని చూసి, రైతులు కంటతడి పెట్టుకోవడం, రవాణా కొరకు నిరసనలు చేయడం, అయినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో, 1500కు పైచిలుకు లారీల ధాన్యాన్ని రైతులు, అప్పు తీసుకువచ్చి 15 నుండి 20 రూపాయలు ఒక సంచి రేటు అని మాట్లాడుకుని మిల్లుకు రవాణా చేసుకున్నారు. భారీ మొత్తంలో మిల్లుకు తరలిన ధాన్యం, లారీల చార్జీలు మరియు కమిషన్, సంబంధిత శాఖ అధికారులు రైతులకు అందించవలసి ఉంటుంది. ఆ లారీల కమిషన్ మరియు చార్జీలు, అధికారులు ఎవరి ఖాతాలో వేస్తారు, ఇప్పటికే అధికార యంత్రాంగం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పై ఎనలేని ప్రేమ చూపించి, ధాన్యం రవాణాకు లారీల సదుపాయం ఏర్పాటు చేయకపోవడంతో,చర్యలు తీసుకొని అధికారులు, పెద్ద మొత్తంలో లారీల చార్జీలు మరియు కమిషన్, రైతుల ఖాతాలోకి, జమ చేస్తారా, లేక కాంట్రాక్టర్ కమిషన్ కింద లారీ కిరాయి మరియు కమిషన్ ను కాంట్రాక్టర్ కు అప్పగిస్తారా, అధికారుల వ్యవహారం ఎటువైపు సాగుతుంది అనేది వేచి చూడాలి.

 

‎ *భారీ దోపిడీకి శ్రీకారం, వర్షం పేరుతో నాలుగు కిలోల కోత.*

 

తాజాగా అన్నపూర్ణ రైస్ మిల్, రైతుల కష్టాన్ని గత నెల రోజుల నుండి కోత పేరుతో రెండున్నర కిలోలు దోచుకుంటున్న విషయం, సాక్షాధారాలతో తెరపైకి తీసుకువచ్చిన, అధికార యంత్రాంగం నిమ్మకు నీరత్తినట్టుగా వ్యవహరిస్తుంది అనడానికి నేటికీ ఏలాంటి చర్యలు లేవు అనేది సాక్ష్యం. ఇక తాజా గత నాలుగు రోజుల క్రింద, వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం, నామమాత్రంగా తరవడం జరిగింది. అన్నపూర్ణ రైస్ మిల్ కు, మరింత దోపిడీ కొరకు వర్షం సాకు దొరికింది, ధాన్యం నల్లబడిందని, రెండున్నర కిలోల నుండి ఒకేసారి నాలుగు కిలోల కోతను ప్రారంభించింది అన్నపూర్ణ రైస్ మిల్, గత శుక్రవారం నుండి రవాణా అయిన ధాన్యాన్ని నాలుగు కిలోల చొప్పున కోత విధించడం, ట్రాక్ షీట్ వెనుక రాసి ఇవ్వడం కుదరదాని, తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. భారీ కోతతో కొందరు రైతులు రైస్ మిల్లు వద్ద ఆగ్రహానికి గురికావడం జరిగిందని తెలుస్తుంది. నాలుగు కిలోల కోత ట్రక్ షీట్ వెనుక రాసి ఇస్తే, తిరిగి పత్రికలో ప్రచురిస్తారని ముందస్తు జాగ్రత్తతో కేవలం నోటి మాటతో రైతులకు కోత విధించినట్లు చెప్పడం జరుగుతుందని అంటున్నారు రైతులు. ప్రభుత్వ ఆదేశాలు ఎక్కడ అన్నపూర్ణ రైస్ మిల్ పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, నేరుగా నాలుగు కిలోల కోత జిల్లా అధికారుల నిర్లక్ష్యం, అన్నపూర్ణ రైస్ మిల్లుతో అధికారులు చీకటి ఒప్పందం చేసుకున్నారని స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు అన్నపూర్ణ రైస్ మిల్ తో పాటు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ మరియు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, తమకు అధికారులు ఏమి చేయరని, ఎన్ని కథనాలు ఎన్ని సాక్షాలు వచ్చినా, తమకు ప్రశ్నించే నాధుడు లేడని, రైతులు తలలు వంచి మా ఆదేశాలను పాటిస్తేనే, మీ ధాన్యం సేఫ్ గా ఉండి మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి లేదంటే ఎక్కడ చెప్పుకున్నా తమకేమీ కాదని దర్జాగా త్రిమూర్తులు రైతులతో చెప్పడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

‎ *రైతులకు న్యాయం కాంట్రాక్టర్, రైస్ మిల్లు పై చర్యలు తీసుకునే వరకు అక్షర పోరాటం.*

 

అమాయక రైతుల నుండి వేల క్వింటాళ్ల ధాన్యం కోత పేరుతో లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న అన్నపూర్ణ రైస్ మిల్ అరాచకం,కోటి రూపాయల కమిషన్ కొరకు లారీలు లేకుండానే, వంద లారీలు ఉన్నాయని బూచిగా చూపెట్టి, ధాన్యం రవాణా చేయకుండా, రైతులు సొంత ఖర్చుతో రైస్ మిల్లుకు ధాన్యం పంపించుకునే వరకు వేచి చూసి, చివరికి రైతులు పంపించిన ధాన్యం లారీల కిరాయి తో పాటు కమిషన్, దండుకునే ప్రయత్నం చేస్తున్న కాంట్రాక్టర్, పిఎసిఎస్, డీసీఎంఎస్, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో, బార్ధన్ విక్రయాలు చేసి, కనీసం టార్పాల్ కూడా రైతులకు ఇవ్వకుండా, ధాన్యం కాంటాలు ప్రతి బస్తాకు 300 గ్రాముల కోత, విధిస్తూ, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తోపాటు అన్నపూర్ణ రైస్ మిల్ తో, కుమ్మక్కై రైతుల ధాన్యం, క్యాటగిరి, లాంటి వివారాలు చేసి కేవలం కమిషన్ కక్కుర్తి కోసం రైతులకు అన్యాయం చేస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వహకుల అరాచకం, పై జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకునే వరకు, నిజం న్యూస్ తన అక్షర పోరాటాన్ని కొనసాగించడం జరుగుతుంది. అలాగే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్ తరలించే వరకు, రైతులు వెచ్చించిన డబ్బు, కోత విధించిన ధాన్యానికి డబ్బులు అందే వరకు, రైతుల పక్షాన ప్రజా గొంతుకై ఆరు కాలం కష్టపడి పండించిన రైతు సొమ్మును దోచుకున్న రైస్ మిల్ కాంట్రాక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహకుల నుండి కమిషన్ ను కక్కించి, రైతులకు న్యాయం అందెవలకు రైతుల పక్షాన అక్షర పోరాటాన్ని కొనసాగించడం జరుగుతుంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button