రూ.19 లక్షల చోరీ కేసు లో… పనిమనిషి కుటుంబం అరెస్ట్

బాలిక తన స్నేహితుడు దేవకుమార్‌తో కలిసి చోరీకి ప్రణాళిక రచించింది. దొంగిలించిన నగదుతో బైక్, ఐఫోన్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఇప్పటివరకు పోలీసులు రూ.8 లక్షల నగదును రికవరీ చేశారు.

హైదరాబాద్, మే 6:
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో జరిగిన రూ.19 లక్షల చోరీ కేసు పోలీసులు ఛేదించారు. ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదు మాయం కావడంతో అనుమానం వ్యక్తం చేసిన యజమాని, ముందుగానే స్కెచ్ వేసి నిందితులను పట్టుకునేలా చర్యలు తీసుకున్నాడు.

యజమాని రూ.40 వేల నగదును ఎరగా ఉంచి గమనిస్తుండగా, ఇంటి పనిమనిషి కుమార్తె డబ్బు దొంగిలిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, విచారణలో అసలు విషయం బయటపడింది. పనిమనిషి సైదమ్మ తన 17 ఏళ్ల కుమార్తెతో కలిసి చోరీ చేయించినట్లు ఒప్పుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఆ బాలిక తన స్నేహితుడు దేవకుమార్‌తో కలిసి చోరీకి ప్రణాళిక రచించింది. దొంగిలించిన నగదుతో బైక్, ఐఫోన్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఇప్పటివరకు పోలీసులు రూ.8 లక్షల నగదును రికవరీ చేశారు.

ఈ ఘటనలో సైదమ్మ, దేవకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుతో ఇంటి పనివారిపై యజమాని పెట్టుకున్న అనుమానం నిజమైంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button