ఎల్ ఎన్ టి కార్యాలయం అగ్నికి ఆహుతి.

మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకు మంటలు వ్యాప్తి.

ఎల్ ఎన్ టి కార్యాలయం అగ్నికి ఆహుతి.

మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకు మంటలు వ్యాప్తి.

‎కార్యాలయం 12 రూములు కాలిళీ బూడిద, అందుబాటులో లేని అంబులెన్స్.

భారీ 12 ఏసీలు, పక్కనే ట్రాన్స్ఫార్మర్, షార్ట్ సర్క్యుట్ ఆ లేక ఇంకేమైనా కారణమా.!?

‎ప్రాజెక్ట్ కు సంబంధించిన, ఫైలు ప్రధాన పత్రాలు కంప్యూటర్లు కూడా ఇక్కడే ఉన్నాయి.

పంటల నుండి మంటవ్యాపించాయి, అంటూ ప్రచారం.

ఎల్ఎన్టి కార్యాలయం అగ్నికి ఆహుతి పై అనేక అనుమానాలు.!?

మహాదేవపూర్ భూపాలపల్లి: మె24 (నిజం న్యూస్)

మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ ఎన్ టి ప్రధాన కార్యాలయం, అగ్నికి ఆహుతి అయిన సంఘటన ఆదివారం రోజు చోటుచేసుకుంది, కేవలం గంట 40 నిమిషాల్లో చూస్తుండగానే 12 రూముల కార్యాలయం ఖాళీ బూడిదగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని, మహాదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎల్ ఎన్ టి, కార్యాలయం ఉంది. అక్కడి నుండి, ప్రాజెక్ట్ నిర్వహణకు సంబంధించి పూర్తి కార్యాచరణ నిర్వహించడం జరుగుతుంది. 12 రూములు భారీగా ఏర్పాటు చేసి సాంకేతిక పరికరాలు, శాఖలకు సంబంధించిన ప్రత్యేక విభాగాలతో ఎల్ ఎన్ టి ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించే కార్యాలయం అది. అలాంటి కార్యాలయానికి, ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒకేసారి భారీగా మంటలు చెలరేగాయి, గమనించిన సిబ్బంది లోపలి నుండి బయటికి పరుగులు పెట్టారు, అగ్నిమాపక వాహనాలకు సమాచారం ఇచ్చిన ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో ఎల్ ఎన్ టి కార్యాలయం రెండు గంటల లోపు, అగ్నికి ఆహుతై కార్యాలయంలోని ఫర్నిచర్ తో పాటు సుమారు 42 60 కంప్యూటర్లు, 20 ఎయిర్ కూలర్లు, కాలిపోవడం జరిగింది. మేడిగడ్డ ప్రధాన కార్యాలయం లో మంటలు చిలరేగి కాలిపోవడంపై పలు విధాల అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు మండల వాసులు.

కార్యాలయం 12 రూములు కాలిళీ బూడిద, అందుబాటులో లేని అంబులెన్స్.

మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు ఒకేసారి భారీగా చెలరేగిన మంటలు గమనించిన సిబ్బంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయటకు పరుగులు వేసి, గమనించిన కొందరు స్థానికులు కూడా అక్కడికి చేడరం చేరి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడం జరిగింది. కానీ అగ్నిమాపక శాఖ అందుబాటులో లేకపోవడం నాలుగు 35 నిమిషాలకు 3 ఫైర్ ఇంజన్లు వచ్చేవరకు సుమారు 90% వరకు ఎల్ ఎన్ టి కార్యాలయం, పూర్తిగా ఖాళీ బూడిదగా మారింది.

‎భారీ 12 ఏసీలు, పక్కనే ట్రాన్స్ఫార్మర్, షార్ట్ సర్క్యుట్ ఆ లేక ఇంకేమైనా కారణమా.

ఎల్ ఎన్ టి ,మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఒకేసారి భారీగా అది కూడా మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకు మంటలు చేరరేగడం వెనుక, షార్ట్ సర్క్యూట్ కారణమని కూడా చెప్తున్నారు కొందరు గ్రామస్తులు, ఆదివారం రోజు సుమారు 36 డిగ్రీల ఉష్ణోగ్రత, ఉన్న క్రమంలో ఎల్.ఎన్.టి కార్యాలయం చుట్టూ 12 పెద్ద ఎయిర్ కూలర్లు, వెనుక భాగంలోనే ట్రాన్స్ఫారం ఉండడంతో, ఉష్ణోగ్రత ఎక్కువ కావడంతో ఎయిర్ కూలర్ ట్రాన్స్ఫారంకు, అతి సమీపంగా ఉండడం వలన షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి దారితీసిందని అంటున్నారు గ్రామస్తులు.

ప్రాజెక్ట్ కు సంబంధించిన, ఫైలు ప్రధాన పత్రాలు కంప్యూటర్లు కూడా ఇక్కడే ఉన్నాయి.

ఎల్ ఎండ్ టి ప్రధాన కార్యాలయం లో చెలరేగిన మంటల కారణంగా కార్యాలయం పూర్తిగా కాలిపోవడంతో, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానమైన పత్రాలు, అలాగే సుమారు 40, 50 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ తో పాటు పెన్ డ్రైవ్, ఇలాంటి పరికరాలు కూడా కాలిపోయినట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం మేడిగడ్డ మరమ్మత్తు పనులకు సంబంధించి, నివేదికలు అలాగే, జాతీయ సంస్థల రిపోర్ట్, తో పాటు ఇతర ప్రధాన పత్రాలు కూడా ఈ కార్యాలయంలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. గత నెల ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి, ప్రాజెక్ట్ జాతీయ సంస్థ అందించిన నివేదికలు కూడా ఈ కార్యాలయంలో ఎల్ ఎన్ టి ఈ కార్యాలయంలోని పెట్టి పనులు కొనసాగించాలని తెలుస్తుంది.

‎పంటల నుండి మంటవ్యాపించాయి, అంటూ ప్రచారం.

 మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ ఎన్ టి ప్రధాన కార్యాలయంలో మంటలు చెలరేగి, కార్యాలయం పూర్తిగా కాలిపోయిన సంఘటన కు సంబంధించి కొందరు పంట పొలాల నుండి, మంటలు చెలరేగి వచ్చాయని ప్రచారాన్ని నమ్మడం చేయడం, పంటల నుండి ఏలా మంటలు వస్తాయి, రైతులు పంటలను కాలబెట్టుకుంటారా, ఎల్ ఎన్ టి కార్యాలయం లో మంటలు చెలరేగడానికి, పంట పొలాలకు ఏమైనా సంబంధం ఉందా, ప్రధాన కార్యాలయం లో మంటలు చేరరేగి ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య పత్రాలు సాంకేతిక పరికరాలు, కాలిపోవడంతో ప్రాజెక్ట్ మరమ్మత్తు వ్యవహారం, అలాగే గతంలో నిర్మాణం చేపట్టిన విధి విధానాలకు సంబంధించి  పూర్తి డాటా కూడా కాలిపోవడం జరిగింది. కార్యాలయంలో భారీ మంటల వెనుక కారణాల కు సంబంధించి విచారణ చేయకముందే, పంట పొలాల నుండి వంటలు చెలరేగి కార్యాలయానికి చేరి కార్యాలయం అగ్నికి ఆహుతి అయిందని, సంఘటనను పక్కదారి పట్టిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది అని అంటున్నారు ప్రజలు. ఎల్ ఎన్ టి సంస్థకు సంబంధించిన ఉన్నత అధికారి ఎవరు కూడా స్పందించకపోవడం, సంఘటనకు సంబంధించి ఎలాంటి సమాచారం కూడా తెలుపకపోవడం. కొందరు అధికారులు కలిసి కుట్టు చప్పుడు కాకుండా  లులోపల సమావేశాలు నిర్వహించడం చూసిన ప్రజలుకు సంఘటనపై మరిన్ని అనుమానాలు తలెత్తిన చేస్తుంది అంటున్నారు ప్రజలు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button