ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక పురోగతి.. స్కార్పియో వాహనం గుర్తింపు!
అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని గుర్తించిన పోలీసులు, దాని యజమానిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

*హత్యలో ఐదుగురు ఉన్నట్లు పోలీసుల గుర్తింపు.. స్కార్పియో యజమాని అదుపులోకి..*
*కొనుగోలుదారుల కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలింపు*
హైదరాబాద్: అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని గుర్తించిన పోలీసులు, దాని యజమానిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా, వాహనం యజమాని ఆ స్కార్పియోను సుమారు ఆరు నెలల క్రితమే విక్రయించినట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే, వాహనం కొనుగోలు చేసిన వ్యక్తులు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ను తమ పేర్లకు మార్చించుకోలేదని వెల్లడించినట్లు తెలిసింది.
గుర్తు తెలియని వ్యక్తులే వాహనాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలుదారుల అడ్రస్, ఇతర వివరాల కోసం ఆరా తీస్తున్నారు. మరోవైపు, హత్యకు వాడిన వాహనం ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.



