ధాన్యం కొనుగోలు, కేరాఫ్ కమిషన్ మాయ.

ప్రభుత్వంపై వేలెత్తి చూపేలా, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అన్నపూర్ణ రైస్ మిల్ వ్యవహారం.

ధాన్యం కొనుగోలు, కేరాఫ్ కమిషన్ మాయ.

‎‎ ప్రభుత్వంపై వేలెత్తి చూపేలా, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అన్నపూర్ణ రైస్ మిల్ వ్యవహారం.

‎ మహాదేవపూర్, భూపాలపల్లి: మే 30 (నిజం న్యూస్)

యాసంగి ధాన్యం కొనుగోలు రవాణా వ్యవహారం, కేవలం కమిషన్ల కక్కుర్తి కొరకు మారి, ప్రభుత్వ ఆదేశాలను అమలుకు నోచుకోకుండా, రైతులకు ప్రభుత్వం పై చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న, కొనుగోలు కేంద్రాలు, వాటిలో ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, అన్నపూర్ణ రైస్ మిల్ పై జిల్లా అధికార యంత్రాంగం చర్యలకు నోచుకోకపోవడం పేద రైతుకు, కన్నీరు మిగులుస్తున్న, రాష్ట్రంలో ఏకైక జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మహాదేవపూర్ సబ్ డివిజన్ పరిధిలోని కొనుగోలు కేంద్రాల వ్యవహారం దీనికి రైతుల నిరసనలు, రైతులే స్వతహాగా ధాన్యం రవాణా, వందల బస్తాలు తరుగు తాలు పేరుతో రైస్ మిల్లు కోత విధించి అందించిన ట్రక్ షీట్ ఏ సాక్ష్యం. ఇప్పటికీ 50 రోజులు గడుస్తున్న సబ్ డివిజన్ పరిధిలోని అనేక కొనుగోలు కేంద్రాల్లో, పేద రైతులు తమ స్తోమత లేక సొంతగా లారీలను ఏర్పాటు చేసుకోలేక ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రంలోని మిగిలి ఉంది. మరోవైపు రవాణా చేసిన ధాన్యాన్ని అన్నపూర్ణ రైస్ మిల్, ప్రభుత్వ ఆదేశాలకు లెక్కచేయకుండా, రోజుకు అర కిలో చొప్పున కోత పెంచుతుంది ఉంది, తాజాగా మూడు కిలోల వరకు ధాన్యాన్ని కోత విధించడంతో ఆగ్రహిస్తున్నారు రైతులు. ఈ వ్యవహారం అంతా, కొనుగోలు కేంద్రాలు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ రైస్ మిల్ నిర్వాహకుల కనుసైగల్లో కేవలం కమిషన్ కక్కుర్తి కొరకు, రైతుల ఆరు కాలం పంట కష్టాన్ని దోచుకుంటున్నారు ఈ త్రిమూర్తులు.

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button