భూతగాదాలు, మూడనమ్మకాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు.

పొనుగోడు గ్రామంలో కార్యక్రమం నిర్వహించి ప్రజలను సామాజిక అంశాల పట్ల చైతన్య పరచడం జరిగింది.

హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు*

 

గరిడేపల్లి జూలై 1 (నిజం చెపుతాం)

 

జిల్లాలో ప్రతి బుధవారం రోజున నిర్వహించనున్న పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పొనుగోడు గ్రామంలో కార్యక్రమం నిర్వహించి ప్రజలను సామాజిక అంశాల పట్ల చైతన్య పరచడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐ చరమంద రాజు మాట్లాడుతూ సామాజిక అంశాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని గ్రామంలో యువత పౌరులు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని సూచించారు. భూతగాదాలు మూఢనమ్మకాలతో నేరాలకు పాల్పడవద్దు అని ప్రజలు జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు.

శాస్త్ర సాంకేతికతతో సమాజం అభివృద్ధి చెంది ముందుకు వెళుతున్నదని బాణామతి, మంత్రాలు, తంత్రాలు లాంటివి ఏమీ లేవు అని అన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన వ్యవసాయ భూముల గట్ల తగాదాలు స్థల వివాదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. తగాదాలు పెట్టుకుంటూ భౌతిక దాడులకు పాల్పతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో గతంలో జరిగిన భూ పంచాయితీ నలుగురికి జీవిత ఖైదు పడిన విషయాన్ని గుర్తు చేశారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button