రెండు కిలోల బియ్యం కట్,?
సూరారం గ్రామంలో రేషన్ డీలర్ అరాచకం.!? ప్రశ్నిస్తే ప్రభుత్వం సరిపడా బియ్యం సరఫరా చేయలేదు.? లబోదిబోమంటున్న బాధితులు, అధికారులు చర్యలు తీసుకోవాలి, గ్రామస్తులు.

రెండు కిలోల బియ్యం కట్,?
సూరారం గ్రామంలో రేషన్ డీలర్ అరాచకం.!?
ప్రశ్నిస్తే ప్రభుత్వం సరిపడా బియ్యం సరఫరా చేయలేదు.?
లబోదిబోమంటున్న బాధితులు, అధికారులు చర్యలు తీసుకోవాలి, గ్రామస్తులు.
మహాదేవపూర్, భూపాలపల్లి: ఏప్రిల్ 19 (నిజం న్యూస్)
మూడు నెలలకు సరిపడే బియ్యం అందించుటకు ప్రభుత్వం బియ్యాన్ని సరఫరా చేస్తే, పేద లబ్ధిదారులు తమకు ఎవరు ప్రశ్నిస్తారు, ప్రతి రేషన్ కార్డుకు అందించే బియ్యంలో, రెండు నుండి మూడు కిలోల వరకు బియ్యాన్ని కోత విధిస్తూ, కొత్త రకమైన రేషన్ డీలర్ మాఫియా అరాచకాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలో ఒక రేషన్ డీలర్ తెరలేపడం జరిగింది. అమాయక రేషన్ కార్డు లబ్ధిదారుల నుండి మూడు నెలలకు అందించాల్సిన రేషన్ సన్న బియ్యం లో, వ్యక్తులను బట్టి రెండు నుండి మూడు కిలోల బియ్యాన్ని కోత విధిస్తూ అంతే బియ్యం వచ్చాయని, తీసుకు వెళ్లకుంటే అది కూడా దొరకవు అని చెబుతూ పేద రేషన్ కార్డ్ లబ్ధిదారులకు అరాచకానికి గురి చేస్తున్న సంఘటన ఆదివారం రోజు గ్రామంలోని ఒక రేషన్ షాపులో జరగడం తో గ్రామానికి చెందిన రేషన్ కార్డు లబ్ధిదారులు ఆగ్రహించినట్లు సమాచారం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ మే జూన్ మూడు మాసాలకు సంబంధించి, రేషన్ కార్డ్ లబ్ధిదారులకు మూడు నెలల కు సరిపడి రేషన్ సన్నబియ్యాన్ని అందించుటకు సన్న బియ్యం సరఫరా చేయడం జరిగింది. కానీ సూరారం గ్రామంలో మాత్రం ఆయా రేషన్ కార్డులకు అందించవలసిన బియ్యం అందించకుండా, స్థానిక వ్యక్తులు మరియు పలుకుబడి చూసి ఆ డీలర్, రెండు నుండి మూడు కిలోల బియ్యానికి కోత విధించి, అందించడం జరిగిందని సమాచారం. తమకు మూడు నెలలకు సరిపడే సన్నబియ్యానికి ఒక రేషన్ కార్డుకు సుమారు మూడు కిలోల బియ్యం కోత విధిస్తూ అందించడంపై, ఆ డీలర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేషన్ కార్డు లబ్ధిదారులకు, ప్రభుత్వం రేషన్ కార్డులకు సరిపడి బియ్యం అందించలేదని, అందుకే రెండు నుండి మూడు కిలోల బియ్యాన్ని కూత విధించి అందిస్తున్నానని చెప్పడంతో, లబ్ధిదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభుత్వం మరియు సివిల్ సప్లై శాఖ, జిల్లాలో ఎక్కడలేని విధంగా సూరారం గ్రామంలోని ఆ రేషన్ డీలర్ కి తక్కువ బియ్యాన్ని అందించడం జరిగిందా, లేక ప్రభుత్వం సన్న బియ్యం అందించడంతో, డీలర్ ప్రభుత్వం సరిపడా బియ్యాన్ని అందించలేదని చెప్పి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నాడా, అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట గ్రామస్తులు. సన్న బియ్యం పెద్ద మొత్తంలో కోత విధించి అందించి విషయంలో తక్షణమే అధికారులు మరియు జిల్లా కలెక్టర్ స్పందించి, రేషన్ డీలర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు.



