రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లచ్చుబుక్త శ్రీనివాస్ రావు నిన్న (సోమవారం, 29 జూన్ 2026) రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న ఏసీబీ ట్రాప్ – నగదు స్వాధీనం, అధికారి అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 30 (నిజం న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఇరిగేషన్ సబ్-డివిజన్–Iలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లచ్చుబుక్త శ్రీనివాస్ రావు నిన్న (సోమవారం, 29 జూన్ 2026) రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
ఫిర్యాదుదారుడి బంధువుకు చెందిన వ్యవసాయ భూమిలోని గుంతలను పూడ్చేందుకు దొంతికుంట చెరువు నుంచి మట్టి తవ్వి తరలించేందుకు అనుమతి మంజూరు చేయడానికి రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఖమ్మం రేంజ్ ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
అధికారి వద్ద నుంచి రూ.2 లక్షల లంచం నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేసి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం కోరితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో | నిజం న్యూస్



