యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
జడ్చర్ల మున్సిపాలిటీలో దారుణం.

యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
జడ్చర్ల మున్సిపాలిటీలో దారుణం.
జడ్చర్ల మే 16 (నిజం చెపుతాం)
జడ్చర్ల మున్సిపాలిటీలో దారుణం
చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న యువతిని ఓ యువకుడు అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేశారు. అక్కడే ఉన్న స్థానికులు యువకుడి పట్టుకొని చితకబాదారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన వైష్ణవి(22) పోలేపల్లి సజీలోని ఎస్వీకేయం పాఠశాలలో విధులు నిర్వహిస్తుంది. రోజూ లాగే స్కూల్ ముగియగానే ఇంటికి బయల్దేరింది. అయితే వైష్ణవిని గతకొంతకాలంగా వేధిస్తున్న హైదరాబాద్ కు చెందిన రామచందర్ అనే యువకుడు ఇవాళ కూడా అడ్డుపడ్డాడు. మరోసారి వైష్ణవిని వేధింపులకు గురిచేశాడు. సరిగ్గా వైష్ణవి ఇంటి వద్దకు రాగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. వైష్ణవి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఇది గమనించిన స్థానికులు పారిపోతున్న యువకుడిని పట్టుకొని తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది



