అడవిలో మృతదేహం.

రెండు రోజుల క్రింద హత్య జరిగినట్లు, కనబడుతున్న మృతదేహం. ఏల్కేశ్వరం అటవీ ప్రాంతంలో యువకుని హత్య. బొమ్మ పూర్ లో విషాదం.

  1. అడవిలో మృతదేహం.

రెండు రోజుల క్రింద హత్య జరిగినట్లు, కనబడుతున్న మృతదేహం.

ఏల్కేశ్వరం అటవీ ప్రాంతంలో యువకుని హత్య.

బొమ్మ పూర్ లో విషాదం.

మహాదేవపూర్ భూపాలపల్లి మే 3, (నిజం న్యూస్)

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం ఏల్కేశ్వరం గ్రామానికి ఆనుకొని ఉన్న అడవిలో యువకుని మృతదేహం లభ్యం కావడంతో, మండలమంతా 26 ఏళ్ల యువకుని అనుమానస్పద మృతి, సంచలనం లేపింది. ఆదివారం రోజు మండలంలోని ఎలికేశ్వరం గ్రామనికి ఆనుకొని ఉన్న అడవి వద్ద, బొమ్మ పూర్ గ్రామానికి చెందిన శనిగరపు శ్రీకాంత్,26 సంవత్సరాల యువకుని మృతదేహం, కనబడడంతో, స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టడం జరిగింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన యువకుడు శ్రీకాంత్ మృతదేహం లభ్యం కావడంతో, గత రెండు రోజుల క్రింద హత్య చేసి అడవిలో పడేయడం జరిగినట్లు మృతదేహ పరిస్థితిని చూస్తే కనబడుతుంది అంటున్నారు గ్రామస్తులు. మృతదేహాన్ని మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. హత్యకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. అందరితో కలిసిమెలిసి ఉండే వ్యవసాయ కుటుంబానికి చెందిన యువకుడు శ్రీకాంత్, మృత్యువాత వినగానే బొమ్మ పూర్ గ్రామమంతా విషాద ఛాయలు నిండాయి. అలాగే మండలమంతా యువకుని మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూన్నారు.

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button