చెత్తాచెదారంతో దుర్వాసన.. పాదచారులకు తప్పని ఇబ్బందులు!
కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రాయల్ బేకరీ ముందు చెత్తాచెదారం పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా అపరిశుభ్రత తాండవం..
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
కోదాడ, నవంబర్ 07 (నిజం చెపుతాం న్యూస్)
కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రాయల్ బేకరీ ముందు చెత్తాచెదారం పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనడం పట్ల స్థానికులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చెత్తను అక్కడ వేస్తున్నది షాపుల యజమానులా? లేక మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యమా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తప్పు ఎవరిదైనా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు, అక్కడ మళ్లీ చెత్త పేరుకుపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



