రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్..

రాజయ్య కుమారుడైన కల్లెపల్లి సతీష్ కుమార్ (33), పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడలో హిందూ శ్మశానవాటిక అభివృద్ధి, కునారం రోడ్డులోని శ్మశానవాటిక అభివృద్ధి పనులు ప్యాకేజ్-9 కింద చేపట్టిన కాంట్రాక్టర్‌కు సంబంధించిన తుది బిల్లును ప్రాసెస్ చేసి, ఆమోదం కోసం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TUFIDC), హైదరాబాద్కు పంపించేందుకు అధికారిక సహకారం అందించాలంటూ రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో నిన్న అధికారులు నిందితుడి నివాసంలో ఉచ్చుపన్ని, అతడు రూ.2 లక్షల లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని రూ.32,31,900 నగదు బయటపడింది. ఆ నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. తదుపరి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి, కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.

ఇంట్లో రూ.32.31 లక్షల నగదు స్వాధీనం

నిజం న్యూస్, జూలై 15

పెద్దపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న కల్లెపల్లి సతీష్ కుమార్ నిన్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. అధికారిక అనుకూలత కల్పించేందుకు రూ.2,00,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

 

ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజయ్య కుమారుడైన కల్లెపల్లి సతీష్ కుమార్ (33), పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడలో హిందూ శ్మశానవాటిక అభివృద్ధి, కునారం రోడ్డులోని శ్మశానవాటిక అభివృద్ధి పనులు ప్యాకేజ్-9 కింద చేపట్టిన కాంట్రాక్టర్‌కు సంబంధించిన తుది బిల్లును ప్రాసెస్ చేసి, ఆమోదం కోసం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TUFIDC), హైదరాబాద్కు పంపించేందుకు అధికారిక సహకారం అందించాలంటూ రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశాడు.

 

దీంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో నిన్న అధికారులు నిందితుడి నివాసంలో ఉచ్చుపన్ని, అతడు రూ.2 లక్షల లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

 

అనంతరం నిందితుడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని రూ.32,31,900 నగదు బయటపడింది. ఆ నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది.

 

తదుపరి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి, కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.

 

ఏసీబీ అధికారులు ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ, ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినా వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

 

— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button