మహాత్మాగాంధీ ఎంబీసీ లిఫ్ట్ నిర్మాణంలో అవకతవకలు..?
మహాత్మాగాంధీ ఎంబీసీ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అధికారులు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో అవినీతి అక్రమాలకు తెర లేపారన్న విమర్శలు వినపడుతున్నాయి.

కాంటూర్ లైన్ పక్కనే లిఫ్ట్ పంప్ హౌస్ నిర్మాణంలో లోపాలు
వరద వస్తే లిఫ్ట్ పంప్ హౌస్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందంటున్న నిపుణులు…….
పైప్ లైన్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు నిల్
పంప్ హౌస్ కు దూరంలో ఉన్న అగ్రకులాల వారి భూములు తీసుకున్న అధికారులు.
సమీపంలో ఉన్న దళితుల భూములపై ముసలి కన్నీరు
మంత్రి ఉత్తమ్ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్న గ్రామస్తులు
చింతలపాలెం, జూన్ 18 ,నిజం చెపుతాం :
మహాత్మాగాంధీ ఎంబీసీ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అధికారులు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో అవినీతి అక్రమాలకు తెర లేపారన్న విమర్శలు వినపడుతున్నాయి.
కోట్లాది రూపాయలతో చేపట్టిన లిఫ్ట్ నిర్మాణంలో ఎలాంటి అక్రమాలకు అవకతకలు జరగకుండా మంత్రి ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
ప్రతి రైతుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో వేల కోట్లను వెచ్చించి లిఫ్ట్ లను ఏర్పాటు చేస్తున్నది. దీనిలో భాగంగానే సూర్యాపేట జిల్లాలోని ముత్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ పంపు హౌస్ పైప్ లైన్ వెల్లటూరులోనే నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే…….
కానీ ఈ పంప్ హౌస్ కాంటూర్ లైన్ కు అతి తక్కువ సమీపంలో నిర్మాణం చేపడుతున్నారు. కృష్ణానదికి అకస్మాత్తుగా వరదలు వచ్చిన, ఏమైనా ప్రతికూల వైపరీత్యాలు సంభవించినా పంప్ హౌస్ పూర్తిగా నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తుండటం గమనార్థం…. పంప్ హౌస్ లిఫ్ట్ ఏరియా ల్యాండ్ ఆక్వేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులకు అప్పజెప్పడం జరిగింది.
ఈ ల్యాండ్ ఆక్వేషన్ విషయంలో అధికారులు తమ ఇష్టారాజ్యంగా తప్పుల తడకలతో సర్వే చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాండ్ ఆక్వేషన్లో సైతం కుల వివక్షత చూపిస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు పంప్ హౌస్ లిఫ్ట్ కు ఉపయోగపడని, పంప్ హౌస్ వల్ల ఎటువంటి ప్రమాదం సంభవించని , సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అగ్రకులాల భూములు ఆక్టిషన్ చేయడం జరిగింది అని, పంప్ హౌస్ లిప్ట్ కు అతి సమీపంలో 100 మీటర్ల దూరంలో472 సర్వేనెంబర్ లేని దళితుల భూములు మునిగిపోయే అవకాశం ఉందని తెలిసినా ఇరిగేషన్ అధికారులు తీసుకోకపోవడం గమనార్ధం…
తమ భూములను ఎందుకు తీసుకోవడం లేదని రైతు కేతపల్లి శ్రీను గత సంవత్సరం నుండి ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే సంబంధిత అధికారులు కలవకపోవడం ఫోన్ ద్వారా సంప్రదించిన ఫోన్ ఎత్తకపోవడంతో చేసేదేం లేక ఊరుకున్నట్లు చెబుతున్నాడు.
4 నెలల క్రితం కలిసిన ఒక అధికారి నీ భూమిని తీసుకోము అని తేల్చి చెప్పడంతో….. రైతు ఎందుకు అని అడిగితే నీ ల్యాండ్ ప్రమాదానికి గురి అయిన మాకు సంబంధం లేదని ల్యాండ్ మేము తీసుకోమని ఒకవేళ నీ భూమి మునకకు గురైతే చూద్దాం. మేము రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎలాగూ ఇక్కడ నుండి వెళ్లిపోతాం అప్పుడు మాకు ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పడం కోస మెరుపు.
కాంటూర్ లైన్ పక్కనే లిఫ్ట్ పంప్ హౌస్ నిర్మాణం…
పులిచింతల మునక ప్రాంతాన్ని గతంలో ఏపీ ఇరిగేషన్ అధికారులు గుర్తించి ఆ భూములకు నష్ట పరిహారం సైతం చెల్లించడం జరిగింది ఏపీ అధికారులు గుర్తించిన మునక ప్రాంతానికి కాంటూర్ లైను అని పిలవబడుతుంది…. అది ఎక్కడ ఉందో, ఎంతవరకు ఉందో కూడా ఇరిగేషన్ అధికారులకు తెలియని పరిస్థితి….. ఈ కాంటూర్ లైన్ కు అతి సమీపంలో పంప్ హౌస్ ను ఏర్పాటుకు చేస్తున్న నేపథ్యంలో…. కృష్ణ నదికి ఏమైనా విపత్తులు సంభవిస్తే పంప్ హౌస్ లిఫ్ట్ పూర్తిగా దెబ్బతింటుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
గతంలో నిర్మించిన శివగంగ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇదే పద్ధతిలో నిర్మించడం జరిగింది అది ప్రస్తుతం రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని, రాబోయే రోజుల్లో ఇదే పద్ధతిలో కొనసాగిస్తే మహాత్మా గాంధీ ఇరిగేషన్ ఎంబీసీ లిఫ్ట్ పరిస్థితి కూడా అదే కోవకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైపు లైన్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు నిల్….
పంప్ హౌస్ పైప్ లైన్ నిర్మాణంలో క్వాలిటీ పైప్ లైన్ కాకుండా ఇష్టానుసారంగా పైప్ లైన్ వేస్తున్నారు పైప్లైన్ కింద ఇసుక పోయకుండా మట్టి , రాయి పోస్తున్నారు. భవిష్యత్తులో పైపు అడుగు భాగంలో, సైట్స్ లో మెత్తదనం లేకపోవడం వలన పైప్లైన్ దెబ్బతినే అవకాశాలు వంద శాతం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగి.. పైప్ లైన్ దెబ్బతింటే పక్క పొలాల రైతులు పూర్తిగా నష్టపోవడం ఖాయమంటున్నారు.
పంప్ హౌస్ కు దూరంలో ఉన్న అగ్రకులాల భూములను తీసుకున్న అధికారులు……
పంప్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు సరిపోతుంది కానీ అధికారులు మాత్రం 95 ఎకరాల… భూమిని దేని కొరకు తీసుకున్నారో అర్థం కావడం లేదు……?
కాంటూర్ లైన్ లోపల ఉన్న భూములను తీసుకొని పులిచింతల ప్రాజెక్ట్ కంటూర్ లైన్ కి సుమారుగా 2 కిలో మీటర్ల వరకు పులిచింతల బ్యాక్ వాటర్ ఫోర్స్ , పంపు హౌజ్ మోటార్స్ పోర్స్ ఎక్కువగా ఉన్నందున ఏ క్షణమైనా పైప్ లైన్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది ఇది కూడా ఇరిగేషన్ అధికారులకు పరిగణంలోకి తీసుకోకపోవడం ఏందని సంబంధిత రైతులు ప్రశ్నిస్తున్నారు…
కాంటూర్ లైన్ లోపల పైప్ లైన్ వెయ్యకూడదు కానీ అధికారులు మాత్రం పైప్ లైన్ వేస్తుండటం గమనార్హం.
వెల్లటూరు పంప్ హౌస్ లిఫ్ట్ అంచనా వ్యయం సుమారు 1600 కోట్లు కాగా అధికారులు తమ ఇష్టారాజ్యంతో సుమారు రూ. 400 కోట్లను పక్కదారి పట్టే అవకాశం లేకపోలేదు.. ఇదంతా ప్రభుత్వ పెద్దలు గమనించాలని నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు.
88 మంది రైతులకు నష్టపరిహారం
లిఫ్ట్ నిర్మాణానికి భూసేకరణలో భాగంగా మొదటి విడత 68 ఎకరాల 28 గుంటలు భూమిని సేకరించి లబ్ధిదారులకు 15.69.5830 ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది
రెండో విడత భూసేకరణలో 22 ఎకరాల 14 గుంటల రైతుల నుండి భూమిని సేకరించి రైతులకు 5.36.29.747 రూపాయలు అందజేశారు. మొత్తంగా రెండు విడతలుగా 90 ఎకరాలకు 88 మంది రైతుల నుండి భూమిని సేకరించి నష్టపరిహారం అందజేశారు.
సమీప భూముల్లో పంట నష్టం జరిగే అవకాశం ..
ఈ పైప్ లైన్ వేసిన సుమారు 40 కిలోమీటర్ల పొడవు వేయాల్సి ఉంది…. అయితే ఇందులో 55 మంది రైతుల భూములు కేవలం రెండు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న భూములు నుండి పంప్ హౌస్ పైప్ లైన్ వెళ్లడంతో ఏదైనా నష్టం సంభవిస్తే రెండు కిలోమీటర్ల మేర ఆనుకొని ఉన్న 55 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ చిన్న సన్నకారు రైతులు పంటలు భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ జిల్లా అధికార యంత్రాంగం నుండి మంత్రి ఉత్తమ్ సమగ్ర నివేదిక తెప్పించుకొని భవిష్యత్తులో రైతులకు ఎలాంటి పంట నష్టం వాటిల్లకుండా చూడాలని ఆ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు.
పంపు హౌస్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు లేవు..
కేతేపల్లి శ్రీను (స్థానిక రైతు)
వెల్లటూరు ఎంబీసీ పంప్ హౌస్ కు ఎటువంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు గ్రామపంచాయతీ పర్మిషన్ కానీ ప్రజాభిప్రాయ సేకరణ కోరలేదు పంప్ హౌస్ కి 100 మీటర్ల దగ్గర్లో ఉన్న భూమి నుండి పైపులైను వెళ్తుంది. ఆ భూములు తీసుకోకుండా ఎటువంటి ప్రమాదాలకు గురికాని భూములు పంపు హౌజ్ పైపులైనుకు ఎటువంటి సంబంధం లేని భూములు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములు కొనుగోలు చేసినారు అట్టి భూముల నుండి పైపు లైన్ వేయకుండా వేరే ఎస్సీ సామాజిక వర్గాల భూముల వైపు మళ్లించారు. ఈ ల్యాండ్ ఆక్యుపేషన్ ద్వారా సుమారు 18 కోట్లు ప్రజా ధనాన్ని కొల్లగొట్టారు. మాకు న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తాం



