అంధకారంలో గరిడేపల్లి టౌన్ ఫీడర్

*చలనం లేని విద్యుత్ అధికారులు*
*లైన్ల కింద ఉన్న చెట్లను నరకడంలో నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు*
గరిడేపల్లి జూన్ 12 (నిజం చెపుతాం)
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి 24 గంటలు గడుస్తుంది. గత రాత్రి కురిసిన వర్షానికి మండల కేంద్రంలో పలు వీధులలో చెట్ల కొమ్మలు విరిగిపడడం కరెంట్ వైర్లు మెలకలు తిరగడం జరిగింది. ఫలితంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఉదయం నుండి సర్వ ప్రయత్నాలు చేసినా ఇంకా కొంత మేరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం గానే ఉన్నది. గతంలో పలుమార్లు టౌన్ ఫీడర్ లో ఉన్న లైన్ల కింద ఉన్న చెట్లను నరకడం కోసం ఎన్నోసార్లు ఎల్సీలు తీసుకొని విద్యుత్తును నిలిపివేసినారు. కానీ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న లైన్ కు మాత్రం వైర్ల కింద ఉన్న వేపచెట్టు మండలం నరకలేదని ఆ లైన్ కన్జ్యూమర్లు అంటున్నారు. ఏది ఏమైతే నేమి ఆ లైను కింద చెట్లను నరికే ప్రయత్నం చేయలేదు విద్యుత్ సరఫరాను అందించలేకపోయారు. సుమారు 40 ఇండ్లలో ఉన్న చిన్నపిల్లలు వృద్ధులు చానా ఇబ్బంది పడుతున్నారు.



